యంగ్ హీరో నిఖిల్ .. ఈ ఏడాది ‘చెక్, రంగ్ దే’ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించాడు. వీటిలో కొంతలో కొంత ‘రంగ్ దే’ సినిమానే పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు తాజా చిత్రం ‘మాస్ట్రో’ సినిమా మీదే మెయిన్ ఫోకస్ పెట్టాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్’ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకి మేర్లపాక గాంధి దర్శకుడు. నభానటేశ్ కథానాయికగా.. మరో ప్రధాన పాత్రను తమన్నా పోషిస్తున్న ఈ సినిమా మీద టాలీవుడ్ లో అంచనాలు బాగానే ఉన్నాయి.
ప్రస్తుతం ‘మాస్ట్రో’ మూవీ హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులోని కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు. గుడ్డివాడైన యువకుడు ఒక హత్యకు ప్రధాన సాక్షిగా మారతాడు. అప్పుడు జరిగే కొన్ని అనూహ్య సంఘటనలు .. ఆ యువకుడి జీవితాన్ని ఎలాంటి మలుపుతిప్పాయి.. అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్ని బాగా థ్రిల్ చేసింది.
జూన్ లో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగా నేడు శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ ‘మాస్ట్రో’ మూవీకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను విడుదల చేశారు. హీరోయిన్ నభా నేటేశ్ వెస్పా స్కూటర్ డ్రైవ్ చేస్తుండగా.. వెనకాల హెల్మెట్ తో నితిన్ రివీలయ్యాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Must Read ;- నితిన్ సరసన కథానాయికగా రౌడీ బేబీ?
Love is Blind and Love doesn’t Discriminate! #MAESTRO🎹 is on the way with his girl to wish you a Happy #SriRamaNavami 🏹💥@actor_nithiin @NabhaNatesh @tamannaahspeaks @MerlapakaG @SreshthMovies #SudhakarReddy #NikithaReddy #RajKumarAkella @mahathi_sagar @Jisshusengupta pic.twitter.com/RO3GdbcDuI
— BA Raju's Team (@baraju_SuperHit) April 21, 2021











