అఖిల్, స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఏజెంట్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఏజెంట్ అనే టైటిల్.. ఫస్ట్ లుక్ సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేసిందని చెప్పచ్చు. అయితే.. ఈ చిత్రానికి సంగీతం అందించే బాధ్యతను సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ కి అప్పగించారు. థమన్ భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరి ఈ కారణం చేతనో మరో కారణం ఏదైనా ఉందో తెలియదు కానీ… ఏజెంట్ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేయలేదట.
సురేందర్ రెడ్డి ఎన్ని సార్లు చెప్పినా.. స్పందించడం లేదట. అందుచేత తమన్ ని పక్కన పెట్టి ఆ బాద్యతను మరో సంగీత దర్శకుడు హిప్ హాప్ తమీజాకు అప్పగించారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ ఇయర్ ఎండింగ్ కి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలనే ప్లాన్ తో షూట్ చేస్తున్నారు. ఇందులో అఖిల్ కి గురువు పాత్రలో మలయాళ అగ్రహీరో మమ్ముట్టి నటిస్తున్నారు. అఖిల్, మమ్ముట్టి పై వచ్చే సన్నివేశాలు చాలా ఇంట్రస్టింగ్ గా.. ఉంటాయని సమాచారం. స్టైలీష్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నాడు.
అఖిల్ ఏజెంట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు. ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడం వలన డిసెంబర్ లో రిలీజ్ చేయడం కుదరడం లేదు. 2022 సమ్మర్ లో ఏజెంట్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.











