ఈ కంప్యూటర్ కాలంలో ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఎవరు ఎక్కడ నుంచైనా సినిమా తీయచ్చు. అలాగే టాలెంట్ ఉందని తెలిస్తే… మనం ఊహించని విధంగా ఎక్కడ నుంచైనా ఆఫర్స్ రావచ్చు. హాలీవుడ్ మూవీ తీయాలంటే… అక్కడకి వెళ్లే తీయాలని లేదు. మన హైదరాబాద్ లో ఉండి సినిమా తీస్తే… హాలీవుడ్ చూసేలా చేసి చరిత్ర సృష్టించారు దర్శకధీరుడు రాజమౌళి. ఈవిధంగా ఇప్పుడు హాలీవుడ్ దృష్టి ఇండియన్ సినిమా పైన, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ పైన పడిందని చెప్పచ్చు. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ పైన తెలుగు, తమిళ్ ఇండస్ట్రీ పైన పడిందని చెప్పచ్చు.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ మురుగుదాస్ కి హాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందట. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో సినిమాలు తీసిన మురుగుదాస్ కి హాలీవుడ్ మూవీ తీసే సత్తా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గజిని సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో సైతం సెన్సేషన్ క్రియేట్ చేశారు. మురుగుదాస్ తో సినిమా చేయడానికి హాలీవుడ్ ఫేమస్ స్టూడియో డిస్పీ పిక్చర్స్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
మురుగుదాస్ తో యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. మురుగుదాస్ హాలీవుడ్ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకుంటే.. హాలీవుడ్ మూవీని డైరెక్ట్ చేసిన ఫస్ట్ తమిళ డైరెక్టర్ గా మురుగుదాస్ రికార్డ్ క్రియేట్ చేస్తారేమో అయితే.. హాలీవుడ్ మూవీని డైరెక్ట్ చేసిన తొలి సౌత్ డైరెక్టర్ గా, తొలి తెలుగు డైరెక్టర్ గా ఎస్వీకృష్ణారెడ్డి ఎప్పుడో రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయన శ్రీకాంత్ తో తెరకెక్కించిన ‘ఆహ్వానం’ సినిమాని ‘డైవోర్స్ ఇన్విటేషన్’ పేరుతో హాలీవుడ్ మూవీని తీసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అలాగే టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత దర్శకుడిగా మారిన ఆర్పీ పట్నాయక్ సైతం హాలీవుడ్ లో ‘అమీ’ అనే హారర్ మూవీ డైరెక్ట్ చేసి మంచి అటెమ్ట్ చేశారు అనిపించుకున్నారు. ఇంకా కొంత మంది తెలుగు దర్శకులు హాలీవుడ్ మూవీస్ తీయాలనుకుంటున్నారు. మరి.. భవిష్యత్ లో అటు తమిళ్ ఇటు తెలుగు నుంచి మరింత మంది దర్శకులు హాలీవుడ్ మూవీస్ తీస్తారేమో చూడాలి.
Must Read ;- చియాన్ విక్రమ్ తో అందాల రాశి రొమాన్స్ ?