నార్త్ హీరోయిన్లు తమ కెరీర్ భలేగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. తెలుగులోకి రాకముందే హిందీలో ఓ రెండు మూడేళ్లు ట్రైల్స్ వేసి, ఏదైనా ఓ చిన్న సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఆ సినిమా తోక పట్టుకుని ఎవరైనా మీడియం రేంజ్ స్టార్ హీరో సినిమాలో నటించడానికి ట్రై చేయడం, లక్ బాగుండి ఆఫర్ తో పాటు సినిమా హిట్ అయితే సూపర్ స్టార్స్ సినిమాల్లో నటించేయడం, రాత్రికి రాత్రే స్టార్లు అయిపోవడం.
నార్త్ బ్యూటీ కాజల్ కూడా ఇలానే తన కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేంజ్ ఉంది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తో తప్పితే కాజల్ అందరు తెలుగు హీరోలతో నటించేసింది. అయితే తెలుగులో అవకాశాలు తగ్గే లోపే తమిళంలో కూడా కాజల్ సినిమాలు చేసి, అక్కడ కూడా క్రేజ్ బాగానే తెచ్చుకుంది. తమిళంలో స్టార్ హీరోలంతా కాజల్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అయితే ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్లు పెద్దగా రావడం లేదు. సూపర్ సీనియర్ హీరోలు సరసన మాత్రమే ఆఫర్లు వస్తున్నాయి. దీంతో కాజల్ తెలుగు సినిమాల్ని తన డైరీలో మెల్లిగా తప్పించి ఆ ప్లేస్ లో మళయాలం సినిమాలు చేయాలనే ప్లాన్ లో ఉందట, కాజల్ కోసం వెయిట్ చేస్తున్నారో ఏమో మల్లూవుడ్ స్టార్ హీరో పృధ్వీ, నివిన్ పాలీ, ఫహాద్ ఫాజిల్ తదితరలు కాజల్ పోర్ట్ ఫోలీయోలు అడగుతున్నట్లుగా తెలిసింది. మరి కాజల్ ని మల్లూ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.











