దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను నేటి స్టార్ హీరోయిన్లు బాగా ఫాలో అవుతున్నారు. కాస్త క్రేజ్ రాగానే రెమ్యూనరేషన్ పెంచేయడమే కాదు ఎవరైతే హీరో రెమ్యూనరేషన్ బాగా ఇస్తున్నాడో చూసి కావాలని ఆ హీరో సరసన యాక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక హీరో విశాల్ కెరీర్ మొదటి నుంచి తను యాక్ట్ చేసే సినిమాల్లో స్టార్ హీరోయిన్లు తీసుకుంటూ ఉంటాడు. కథ ఫిక్స్ అయిన తరువాత విశాల్ పట్టించుకునే కేవలం ఈ వ్యవహారం మాత్రమే, ఎవరైనా స్టార్ హీరోయిన్ డేట్స్ ఇవ్వకపోతే తన మార్కెట్ రేట్ నాలుగింతలు కూడా ఆఫర్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సెల్యూట్ సినిమాలో నయనతారను హీరోయిన్ గా తీసుకోవడానికి విశాల్ ఆమెకు ఇచ్చిన ఆఫర్ అక్షరాల రెండు కోట్లు, అప్పట్లో ఇది సెన్సేషన్ అయిపోయింది.
అయితే రెండు కోట్లు విశాల్ ఇచ్చినప్పటికీ సెల్యూట్ కోసం నయనతారతో హాట్ సాంగ్స్ చేయించాడు. ఈ సినిమా తరువాత నయన్ కి క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం విశాల్ సినిమాల్లో హీరోయిన్ ఆఫర్లు కోసం పూజాహెగ్డే, రష్మిక మందాన, నివేధా పేతురాజు, అనుపమ పరమేశ్వరన్ వంటి వారు విపరీతంగా ట్రై చేస్తున్నారట.
ఇటీవలే యాక్షన్ సినిమా కోసం తమన్నాకి మూడు కోట్లు రెమ్యూనరేషన్ ఇప్పించాడట విశాల్, దీంతో తమన్నా ఈ సినిమాలో బికినీ వేసుకొని విశాల్ సరసన ఆడిపాడింది. సినిమా హిట్ అవ్వకపోయినా ఈ పాట మాత్రం పెద్ద హిట్ అయింది. మరి విశాల్ సరసన తన అప్ కమింగ్ మూవీలో నటించే ఆ లక్కీ బ్యూటీ ఎవరో చూడాలి.











