హీరోయిన్ సమంతకు ఇప్పటికే సాకి బ్రాండ్ ఉంది. ఏకమ్ అనే ప్లే స్కూల్ కూడా నడుపుతోంది. ఇప్పుడు
దీనికి అనుబంధంగా మరో వ్యాపారం ప్రారంభించాలని చూస్తోంది శామ్. అన్నీ అనుకున్నట్టు కుదిరితే జ్యూవెలరీ బిజినెస్ ప్రారంభించాలనుకుంటోంది సమంత. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆమె కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
అటు తమన్న ఆల్రెడీ జ్యూవెలరీ బిజినెస్ లో ఉంది. ఈమధ్య వజ్రాల వ్యాపారంలోకి ఎంటరైంది మిల్కీబ్యూటీ. వ్యాపారం రంగంలో కొనసాగుతున్న తారలు చాలామంది ఉన్నారు. కానీ ఇలా వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెడుతున్న హీరోయిన్ మాత్రం సౌత్ నుంచి తమన్న మాత్రమే. బాలీవుడ్ లో కరీనాకపూర్, కత్రినాకైఫ్ కు కొన్ని డైమండ్ జ్యావెలరీ బ్రాండ్స్ లో వాటాలున్నాయంటూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. అది నిజమే అయినా, వాళ్లు తమ పేరు మీద బ్రాండ్స్ ను ప్రవేశపెట్టలేదు. ఇలా చూసుకుంటే సొంత పేరు మీద డైమండ్ జ్యూవెలరీ బ్రాండ్ పెట్టిన తొలి హీరోయిన్ గా తమన్న నిలిచింది.
ఇక రీసెంట్ గా కాజల్ కూడా బిజినెస్ ప్రారంభించింది. తన భర్తతో కలిసి ఇంటీరియర్ డిజైనింగ్ కు సంబంధించిన వెబ్ సైట్ ను లాంఛ్ చేసింది. గృహాలంకరణకు సంబంధించిన అన్ని వస్తువులు, అలంకరణ సామగ్రి తమ సైట్ లో ఉందని చెబుతోంది. దీంతో పాటు త్వరలోనే ఆమె మూవీ ప్రొడక్షన్ లోకి వస్తానంటూ చెప్పినప్పటికీ, దానికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్ డేట్ లేదు.
ఇలియానా చాన్నాళ్ల కిందటే వ్యాపారం స్టార్ట్ చేసింది. ఆమెకు ముంబయి, హైదరాబాద్ లో బొటిక్స్ ఉన్నాయి. దీంతో పాటు త్వరలోనే ఫుడ్ కోర్టులు కూడా ఓపెన్ చేసే ఆలోచనలో ఉంది ఈ గోవా బ్యూటీ. అటు మరో హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఆల్రెడీ న్యూయార్క్ లో రెస్టారెంట్ స్టార్ట్ చేసింది. ఇక నమిత అయితే.. ఏకంగా ఓటీటీ పెట్టింది. తన ఓటీటీ వేదికపై కొత్త కంటెంట్ ను, చిన్న నిర్మాతల్ని ఎంకరేజ్ చేస్తానని చెబుతోంది. మరో హీరోయిన్ సోనియా అగర్వాల్, ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ పెట్టింది. పెళ్లిళ్లు మాత్రమే కాకుండా, అన్ని రకాల ఫంక్షన్లు చేస్తామంటూ ప్రకటించింది. హీరోయిన్ రష్మికకైతే ఆల్రెడీ వ్యాపారాలున్నాయి. తను సంపాదించిన ప్రతి పైసాను ఆ వ్యాపారాల్లోనే పెట్టుబడులు పెడుతుంటుంది. ఇలా సౌత్ కు చెందిన చాలామంది హీరోయిన్లు తాము సంపాదించిన డబ్బుతో ఇలా వ్యాపారాలు చేస్తున్నారు.
Must Read ;- ఓటీటీలోకి వెండితెర భామలు