(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఒకరు ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు రాసిన లేఖ సంచలనంగా మారింది. స్టీల్ ప్లాంట్ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో ఎస్ శ్రీనివాస్ అనే ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి వెళ్లిపోయారు. ఐడి కార్డు, పర్సు, సెల్ఫోన్ విడిచిపెట్టి నిన్న రాత్రి విధుల్లోకి వచ్చిన ఆయన సి షిఫ్ట్ ముగించుకొని అదృశ్యం కావడంతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. మరోవైపు పోలీసులు ఈ విషయంపై లోతుగా విచారణ ప్రారంభించారు.
ఆ లేఖలో ఏం రాశారంటే..
ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి.32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నాను. ఈ రోజు furnace లో అగ్నికి ఆహుతి కావడానికి ఈ రోజు ఉదయం 5.49 గంటలకు మూహుర్తం ఉంది కాబట్టి ఈ పోరాటం ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి. అని ఒక రూల్ పేపర్ పై రాసిన లేక ఇతర ఉద్యోగులకు లభించింది. కాగా కార్మిక సంఘం నేతలు ఇప్పటికే ఆయనతో చర్చించేందుకు ప్రయత్నిస్తున్న అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరో వైపు గాజువాక పోలీసులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
Must Read ;- జాతీయ స్థాయికి విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం..