అల్లు అరవింద్, అల్లు అర్జున్.. ఇటీవల అల్లు స్టూడియో ప్లాన్ చేస్తున్న విషయాన్ని అఫిషియల్ గా ప్రకటించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న అల్లు స్టూడియోను పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించడం కూడా జరిగింది. అయితే.. ఇంత సడన్ గా అల్లు స్టూడియో నిర్మాణం చేపట్టడానికి కారణం ఏంటి అనేది హాట్ టాపిక్ అయ్యింది. దీని గురించి అల్లు అర్జున్ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.

ఆహా కోసం స్టార్ హీరోయిన్ సమంత సామ్ జామ్ అనే టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అల్లు స్టూడియో కట్టాలని ఎందుకు అనుకున్నారు.? అసలు ఆ ఆలోచన ఎప్పుడు వచ్చిందని సమంత అల్లు అర్జున్ ని ప్రశ్నించగా.. ఒకసారి అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ లో షూటింగ్ ఉంటే తాను లోపలకి వెళ్తూ ఉన్న సమయంలో సెక్యూరిటీ గార్డ్ వెల్కమ్ టు అన్నపూర్ణ స్టూడియో సర్ అని అన్నారు.
అప్పుడు మనకి కూడా ఒక స్టూడియో ఉంటే బాగుంటుందని ఆలోచించన వచ్చింది. ఆతర్వాత నాన్నతో ఇదే విషయం గురించి మాట్లాడితే.. ఆయన కూడా ఒప్పుకోవటంతో అల్లు స్టూడియోను కట్టాలని అనుకున్నామని బన్నీ చెప్పారు. సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం స్టూడియో అవసరం ఉంటుంది. అందుచేత లైఫ్ లాంగ్ ఉండేలా ఈ స్టూడియో నిర్మాణం ఉంటుందన్నారు.











