తెలుగుతో పాటు మలయాళ చిత్ర సీమలో కూడా బన్నీ.. క్రేజీ స్టార్. అతడి సినిమాల్ని అమితంగా ఇష్టపడే ప్రేక్షకులు అక్కడ చాలా మంది ఉన్నారు. తన డబ్బింగ్ చిత్రాల ద్వారా ఉత్తరాదిన కూడా ఓ రేంజ్ లో క్రేజ్ దక్కించుకోవడంతో.. అతడికి ఇప్పుడో అరుదైన ఘనత దక్కడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. వరుసగా ఆరు సంవత్సరాలు గా యాహూ సెర్చింజన్ లో నెం. 1 హీరోగా నిలుస్తున్నాడు.
యాహూ మోస్ట్ సెర్చింగ్ సెలబ్రిటీస్ లిస్ట్ లో అల్లు అర్జున్ వరుసగా నెం. 1 గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. టాలీవుడ్ లో ఆ ఘనత దక్కించుకున్న ఒకే ఒక హీరోగా 2014 నుంచి నెం.1గా నిలుస్తూ వస్తూండడం చాలా గ్రేట్. యాహూ యూజర్లు ఎక్కువగా బన్నీనే సెర్చ్ చేస్తూండడం ఆశ్చర్యం అనిపించకమానదు. మరి బన్నీ ఈ ఘనతను ఇంకా ఎంత కాలం కొనసాగిస్తాడో చూడాలి.
Also Read: ‘అల్లు లోకల్’ సూపర్ హిట్ అయినట్టే!











