జగన్ నిర్ణయాలతో చేనేత రంగ కుదేలు..
వైసీపీ పాలనలో నేతన్నలు ఉరికి వేళాడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. జగన్ నిర్ణయాలతో చేనేత రంగం కుదేలవుతోందని ఆయన ఆరోపించారు. సంక్షేమ ఫలాలు అందకపోవడం వలనే నేతన్నల ఆత్మహత్యలకు పాల్నడుతున్నాయని వాపోయ్యారు. రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాల వలన అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబాలతో కలిసి నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కృష్ణా జిల్లా పెడనలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందక, అప్పుల భారంతో నేతన్న కాచన పద్మనాభం కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన అత్యంత బాధాకరమన్నారు.
టీడీపీ హయంలో నేతన్నకు స్వర్ణయుగం..
తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం హయంలో నేతన్నకు ఏడాదికి సుమారు రూ. 50 వేలకు పైగా వచ్చే ప్రోత్సాహకాలను, రాయితీలను అందించామని లోకేశ్ వివరించారు. ప్రస్తుతం వాటిని ఆపేసి రూ. 24 వేలను చేతిలో పెట్టి సరిపెట్టుకోమంటున్నారని విమర్శించారు. అది కూడా సొంత మగ్గం ఉన్న వారికే వర్తించేలా నిబంధనలు పెట్టారని ఆయన ఆరోపించారు. అప్కో కొనుగోళ్లు ఆగిపోయాయని, మజూరీ, రాయితీలు ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు. సొంతంగా మగ్గం ఏర్పాటుకు సాయం లేదన్నారు. ప్రతి నేత కార్మికునికి నేతన్న నేస్తం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో పాటు అదనంగా గతంలో టీడీపీ ఇచ్చిన ప్రోత్సహకాలు, రాయితీలు కొనసాగించాలని కోరారు. అలా జరిగితే నేతన్నల ఆత్మహత్మలను నివారించవచ్చునని సూచించారు.
Must Read:-జగన్ పాలనలో నేతన్నలకు మిగిలింది ఆత్మహత్యలే!