హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ రోజు పెద్ద ఝలక్కే ఇచ్చింది. సాయంత్ర 4.05 గంటలకు ఓ పెద్ద వార్త చెప్పబోతున్నట్టు ప్రకటించింది. ఏమిటా వార్త అంటూ అందరూ ఎదురుతెన్నులు చూశారు. సమయం దగ్గర పడినా ఎలాంటి వార్తా రాలేదు. తాము చెప్పబోయే సూపర్ న్యూస్ లో కొద్దిపాటి ఆలస్యం జరిగిందని ట్వీట్ చేసింది. మొత్తానికి అది మాత్రం సూపర్ న్యూసేనట. కాకపోతే ఒక్కోసారి ఇలాంటి వార్త చెప్పాల్సి వచ్చినప్పుడు ఆలస్యం జరగొచ్చనే విషయం మీకు తెలుసు కదా అంటూ ముగించింది.
ఇంతకీ ఆ వార్త ఏమై ఉంటుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. హారికా హాసినీ సంస్థ అంటే అది త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా అనే సంగతి మాత్రం అందరికీ తెలుసు. కాకపోతే హీరో ఎవరన్నదే ఉత్కంఠ. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివికమ్ సినిమా ఉంటుందన్న ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. ఇది మెటీరియలైజ్ అవ్వాలంటే, దాన్ని అధికారికంగా ప్రకటించాలంటే అందుకే హీరో కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి కదా. బహుశా అలాంటిదే జరిగి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.
మహేష్ తో త్రివిక్రమ్ సినిమా చేయాల్సి వస్తే ఇది మూడో సినిమా అవుతుంది. ఖలేజా, అతడు తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఈ సినిమా కోసం మహేష్ కు అడ్వాన్సు కూడా ఎప్పుడో ఇచ్చారట. ఆలస్యం అవుతుండటంతో ఆ మొత్తాన్ని వెనక్కి తెచ్చేసుకున్నారన్న మాట కూడా వినిపించింది. మొత్తానికి కొంత గ్యాప్ అయితే వచ్చింది. అలాగే ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాల్లో ముందు ఏది సెట్స్ పైకి వెళుతుందన్నది మరో ప్రశ్న.
‘సర్కారువారి పాట’ షూటింగ్ అయిన వెంటనే త్రివిక్రమ్ – మహేష్ ల సినిమా చేసేయవచ్చని హారికా హాసినీ భావించి ఉండవచ్చు. ట్రిపుల్ ఆర్ అయిన వెంటనే రాజమౌళి మరో సినిమా చేయాలి కదా. ఆల్రెడీ రాజమౌళి – మహేష్ ల కాంబినేషన్ లో సినిమా ప్రారంభం కావలసి ఉంటుంది. అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో స్పష్టత లేదు. ఈ రోజు ప్రాజెక్టు అనౌన్స్ కాకపోవడానికి కొన్ని సందిగ్ధకర పరిస్థితులే కారణమని తెలుస్తోంది. దీని మీద క్లారిటీ తీసుుకని ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించడానికి హారిక హాసిని సంస్థ సిద్ధంగా ఉంది.
Must Read ;- పెర్సనల్ స్టైలిస్ట్ కి కరోనా పాజిటివ్ .. స్వీయ నిర్బంధంలో మహేశ్ బాబు ఫ్యామిలీ