సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ వార్త తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో కృష్ణకు క్యాన్స్ ర్ సోకినట్టు సమాచారం. దానికి చికిత్స తీసుకున్న తర్వాత ఆయన కోలుకున్నారు.
ప్రస్తుతం మళ్లీ ఆ సమస్య తిరగబెట్టినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన మొదటి భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఇటీవలే మరణించారు. రెండో భార్య విజయనిర్మల రెండేళ్ల క్రితం మరణించారు. ఇది కొంత మానసికంగా ఆయనను కుంగదీసింది. ఒకవిధంగా కృష్ణ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు.
ఆయన జీవించి ఉండగానే పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణం కూడా ఆయనను కుంగదీసింది.ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ తర్వాత ఎక్కువగా అభిమానులున్న నటుడు కృష్ణ మాత్రమే. హీరోగా ఎక్కువ సినిమాల్లో నటించిన ఘనత కూడా కృష్ణకే దక్కుతుంది. కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.
విషమంగానే కృష్ణ ఆరోగ్యం
హీరో కృష్ణకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. రాత్రి 2 గంటల సమయంలో ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చారని వెల్లడించారు. కార్డియాక్ అరెస్ట్ స్థితిలో ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఆ స్థితి నుంచి బయట పడ్డారని వెల్లడించారు.