ట్విట్టర్ గొడవ కాస్త ముదిరి పాకాన పడుతోంది. కేంద్రం చెప్పిన అకౌంట్లన్నింటినీ రద్దు చేయకుండా.. మా రూల్స్ ప్రకారమే వాటిని రద్దు చేస్తున్నట్లు కేంద్రానికి రిప్లై ఇచ్చింది ట్విట్టర్. ప్రజా ఉద్యమ కారులు, జర్నలిస్టుల ఖాతాలను రద్దు చేయడం వారి స్వేచ్ఛను హరించడమవుతుందని తెలిపింది. కేంద్రం దీనిపై కాస్త సీరియస్ అయింది. ఇప్పుడు ట్విట్టర్‌పై సుప్రీం కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
విద్వేష పూరితమైన వార్తల వ్యాప్తిని అరికట్టాలని దాఖలైన పిటిషన్‌ని, నేడు సుప్రీం కోర్టు విచారించింది. నకిలీ ఖాతాలు, ఫేక్ న్యూస్‌లకు సంబంధించిన పోస్టులను, ఖాతాలను పరిశీలించాల్సిన బాధ్యత ట్విట్టర్‌కు ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఫేక్ న్యూస్ ప్రచారంపై ట్విట్టర్, కేంద్రాలకు నోటీసులు జారీ చేసింది. ఫేక్ న్యూస్ ప్రచారంపై చర్యలు చేపట్టకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులపై సత్వరమే స్పందించాలని ఆదేశాలు జారీ చేసింది.
Must Read ;- ట్విట్టర్ ఇండియాకు మహిమా కౌల్ రాజీనామా..!