వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై పెద్ద దుమారమే రేగింది. దీనిపై ప్రజలు ఎంతగా మండిపడ్డారో తెలిసిందే. చివరకు వాట్సప్‌కు ప్రత్యామ్నాయాల వైపు కూడా మొగ్గుచూపారు. దీన్ని వల్ల ఒక్కసారిగా యాప్ క్రెడిబిలిటీ దెబ్బతినడంతో.. దెబ్బకు దిగిరాక తప్పలేదు వాట్సప్. తాము ప్రేవేశపెట్టిన ప్రైవసీ పాలసీని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు వాట్సప్ ప్రైవసీ పాలసీని సవాలు చేస్తూ సుప్రీంతో కేసు కూడా దాఖలైంది. దీనిపై నేడు కోర్టులో విచారణ జరిగింది.
వాట్సాప్ ప్రైవసీ పాలసీని సవాలు చేస్తూ పిటిషనర్.. వినియోగదారుల డేటాను ఇతర కంపెనీలతో పంచుకుంటున్నారని పేర్కొన్నారు. విచారణ జరిపిన ధర్మాసనం.. ప్రజల గోప్యతను పరిరక్షించడం కంపెనీ బాధ్యతని అభిప్రాయపడింది. పిటిషనర్ చేస్తున్న ఆరోపణలపై సమాధానం ఇవ్వాలంటూ ఫేస్‌బుక్, వాట్సాప్ సంస్థలకు సుప్రీం నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణకు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Must Read ;- బాప్ రే.. యాప్ లు.. బతుకు బస్టాండే!