తమిళ్ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ గా సూర్య ‘ఆకాశం నీ హద్దురా’లో నటించాడు. ఈ సినిమా నిన్ననే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడులైంది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సూర్య అభిమానులు చాలా ఎమోషనల్ అవుతున్నారు. మంచి టాక్ రావడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక దీని తర్వాత సూర్య ఒక క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడని కోలీవుడ్ టాక్. అతనెవరో కాదు టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్.
ఇప్పటికే సూర్య పలు సినిమాలను ఓకే చేశాడు. కాని అన్నిటికంటే గౌతమ్ మీనన్ సినిమానే ముందుగా సెట్స్ పైకి తీసుకువెళ్లాలని సూర్య భావిస్తున్నాడట. ఇప్పటికే గౌతమ్, సూర్య కోసం ఒక చక్కటి స్క్రిప్ట్ రెడీ చేసాడని, సూర్యకు కి కథ బాగా నచ్చి ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఈ దీపావళి తర్వాత గౌతమ్, సూర్య సినిమా పట్టాలెక్కబోతుందని వినికిడి.
కొద్ది నెలల క్రితమే సూర్య, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ వార్తను అటు డైరెక్టర్ కాని ఇటు సూర్య కాని ఎటువంటి కంఫార్మ్ చేయలేదు. ఇప్పుడు అదే వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో ‘కాక్క కాక్క’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. అందుకే ఈ కాంబినేషన్ పై సూర్య అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే మరి.










