Benefits of Eating Papaya Seeds :
బొప్పాయి.. చాలామంది ఇంటి పెరట్లో కనిపిస్తుంటాయి. బొప్పాయి పండు తిని గింజలను పడేస్తుంటారు కొంతమంది. కానీ వాటిలోని గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయి పండు గింజల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి మంచిదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అనారోగ్య సమస్యలతో పోరాటడంతో పాటు, ఇమ్యునిటీ పవర్ ని పెంచుతాయి.
- బొప్పాయి సీడ్స్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఫుడ్ పాయిజనింగ్ అరికట్టడానికి కూడా సహాయపడతాయి. బొప్పాయి గింజలు ట్యూమర్స్, క్యాన్సర్ సెల్స్ డెవలప్ కాకుండా కాపాడుతాయి. ఇది లంగ్స్, కెలాన్, ప్రొస్టేట్, ల్యుకేమియా, బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించడానికి సహాయపడతాయి. కిడ్నీ సమస్యలను సైతం దూరం చేస్తాయి. ఇది పేగులకు మేలు చేస్తుంది. అయితే తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
- బొప్పాయి గింజలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే పరగడుపునే రెండు స్పూన్ల బొప్పాయి గింజలను రోజూ తింటుంటే మధుమేహం, హార్ట్ అటాక్ వంటి వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. అంతేకాదు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి అనేక రకాల ఇన్ ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. మరియు ఇందులో ఉండే యాంటీ వైరల్ గుణాల కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. డెంగ్యూ ఫీవర్ నివారించడానికి చాలా దేశాల్లో వీటిని వాడుతున్నారు. అయితే బొప్పాయి గింజలు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఎక్కువ తీసుకోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.