తమిళ హీరో సూర్య, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందనుందని.. దీనిని పాన్ ఇండియా మూవీలా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బోయపాటి శ్రీను.. నందమూరి నటసింహం బాలకృష్ణతో అఖండ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత సూర్యతో బోయపాటి పాన్ ఇండియా మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టాక్ వచ్చింది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు సూర్య కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ కథ రెడీ చేశారని తెలిసింది. నిజానికి సూర్య – త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. సూర్య చాలా సార్లు త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించాలనుకుంటున్నాను అని చెప్పారు. కథ సెట్ అయితే.. త్రివిక్రమ్ తో తప్పకుండా సినిమా చేస్తాను అన్నారు. అయితే.. టాలీవుడ్ హీరోలందరూ త్రివిక్రమ్ వెంటపడడంతో ఇప్పటి వరకు ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. ఇప్పుడు అందుకు మార్గం సుగమం అయ్యిందని తెలుస్తోంది.
ప్రస్తుతం మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ తరవాతి సినిమా సూర్యతోనే అని సమాచారం. అయితే.. సూర్య కోసం కథ రెడీ చేసి బోయపాటి కూడా రెడీగా ఉన్నారు. దీంతో సూర్య ముందుగా బోయపాటితో సినిమా చేస్తారా..? లేక త్రివిక్రమ్ తో సినిమా చేస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.