బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణం తర్వాత కేసును సీబీఐకి అప్పగించడంతో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశ జూన్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. ఆమె మరణించిన తర్వాత వారం రోజులు కూడా గడవకముందే సుశాంత్ కూడా మరణించడంతో వీరిద్దరి మృతికి ఏదైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు తలెత్తాయి. దిశ సలియాన్‌ది ఆత్మహత్య కాదని ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారంటూ బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే సంచలన ఆరోపణలు చేశారు. తమ కూతురు గర్భవతి కాదని, అసత్యాలు ప్రచారం చేయవద్దని దిశ తల్లిదండ్రులు మీడియాను కోరారు. అదే విధంగా ఆమెపై అత్యాచారం జరిగిందన్న వార్తలను కూడా వారు ఖండించారు. ఆమె తల్లిదండ్రులు ఆజ్‌తక్‌తో మాట్లాడుతూ.. ‘‘మా కూతురు గర్భవతి కాదు. ఇప్పుడే కాదు ఎప్పుడూ తను గర్భం దాల్చలేదు. తనపై అత్యాచారం కూడా జరగలేదు. తన అవయవాలకు సంబంధించిన రిపోర్టులు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు, పోస్ట్‌మార్టం నివేదిక గురించి ముంబై పోలీసులు మాకు వివరించారు. మాకు వారిపై పూర్తి నమ్మకం ఉంది. దయచేసి దిశకు చెడ్డపేరు తెచ్చేలా రూమర్లు ప్రచారం చేయకండి. మా వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం కలిగించేలా వ్యవహరించవద్దు’’అని కోరారు. తమ కూతురి గురించి తప్పుగా మాట్లాడవద్దని, నిజానిజాలేమిటో అర్థం చేసుకోవాలని ప్రజలను అభ్యర్థించారు.
రియా సంగతేంటి?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని హీరోయిన్ రియా చక్రవర్తి తెలిపింది. రియా నోట్‌బుక్‌లో సుశాంత్ గతంలో రాసిన `నోట్ ఆఫ్ గ్రాటిట్యూడ్` పేజీని రియా లాయర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో తన జీవితానికి, రియా కుటుంబ సభ్యులకు సుశాంత్ కృతజ్ఞతలు తెలిపాడు.
ఆ నోట్ ప్రకారం లిల్లు, బెబు, సర్, మేడమ్, ఫుడ్జ్ మొదలైన వారికి సుశాంత్ కృతజ్ఞతలు తెలిపాడు. ఆ పేర్ల గురించి రియా స్పష్టత ఇస్తూ.. `లిల్లు అంటే షోవిక్ (రియా సోదరుడు), బేబో అంటే నేను, సర్ అంటే మా నాన్న, మేడమ్ అంటే మా అమ్మ` అని పేర్కొంది. అలాగే `చిచ్చోరే` అని రాసి ఉన్న సుశాంత్‌కు సంబంధించిన బాటిల్ ఫొటోను కూడా షేర్ చేశారు. ఇవి, తప్ప సుశాంత్‌కు సంబంధించిన ప్రాపర్టీ ఏదీ తన వద్ద లేదని రియా తెలిపింది. ఈ కేసు విషయంలో సీబీఐ దర్యాప్తు జరుగుతూనే ఉంది.
బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి గారికి సోషల్ వాతలు…!!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......