అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి నలుగురు టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం రూలింగ్ పాస్ చేశారు. ఈ సస్పెన్షన్ ఈ సభకాలం వరకూ(బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు) కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.సభ మొదలవగానే ప్రశ్నోత్తరాలు అయ్యాయి..కాగా, జే బ్రాండ్‌లపై విచారణ, జంగారెడ్డి గూడెం సంఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు పొడియం వద్ద నినాదాలు చేశారు.దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సభ్యులు పోడియం వద్దకు వస్తే చర్యలు తీసుకుంటానని సపేయకే తమ్మినేని హెచ్చారయించారు. దీంతో తెలుగుదేశం సభ్యులు తమ స్థానాల వద్ద నుంచే నినాదాలు చేస్తూ చర్చకు పట్టు బట్టారు.టిడిపి సభ్యులా తీరుపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ సభకు సభ్యులుగా ఉన్న మీరు ప్రశ్నోత్తరాలలో పాల్గొంటారని ఎదురు చూశాం..కానీ, మీరు సభ గౌరవాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు’’ అంటూ తెలుగుదేశం ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, రామరాజు, అనగాని సత్యప్రసాద్ లు ఉన్నారు.
Must Read:-సిక్కోలు లో హోరెత్తిన తెలుగుదేశం | Huge Response for TDP Gourava Sabha in Sikkolu | Leo News