‘శంభో శివ శంభో’ సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు తమిళ దర్శకుడు సముద్రఖని. ఆ తర్వాత ఆయన మెగా ఫోన్ వదిలేసి.. తమిళనాట హీరోగానూ, కేరక్టర్ ఆర్టిస్ట్ గానూ.. ఆపై విలన్ గానూ నటిస్తూ.. సత్తా చాటుకుంటున్నారు. త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో తొలిసారి తెలుగులో విలన్ అవతారమెత్తారు. అందులో ఆయన బాగా సక్సెస్ అవడంతో.. రవితేజ ‘క్రాక్’ లోనూ విలన్ గా అదరగొట్టారు. కటారి కృష్ణ అనే కరుడు కట్టిన విలన్ గా రియల్ లైఫ్ పాత్రను పోషించి మెప్పించిన ఆయన .. ఇప్పుడో స్టెప్ ముందుకేసి .. ఓ తెలుగు సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆ సినిమా పేరు ఆకాశవాణి. ఈ విషయాన్ని ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియచేశారు మేకర్స్ .
ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభరెడ్డి నిర్మాణంలో రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఆకాశ వాణి సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో నటీనటుల వివరాల్ని గోప్యంగా ఉంచారు మేకర్స్. ఇక ఈ సినిమాకి కీరవాణి తనయుడు , సింగర్ అయిన కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ మూవీకి ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ సంభాషణలు సమకూర్చుతున్నారు. ఇక ఆకాశవాణి టీజర్ ను రేపు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు మేకర్స్ . మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో సముద్ర ఖని ఏ రేంజ్ లో అలరిస్తారో చూడాలి.
https://twitter.com/AakashavaaniM/status/1366366042474172417











