‘గొడవ’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన .. ఏ.కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్.. ఆ తర్వాత కాస్కో, సరోజా లాంటి సినిమాల్లో మాత్రమే కనిపించాడు. తెలుగులో ఈ హీరో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయినా.. తమిళంలో మాత్రం పలు చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. యస్పీచరణ్, వెంకట్ ప్రభు , ప్రేమ్ జీ అమరన్ ఫ్రెండ్స్ సర్కిల్ లో వైభవ్ కూడా ఒకడు. ఈ గ్యాంగ్ చాలా సినిమాలతో తమిళ , తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు.
తాజా గా వైభవ్ ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాడు. సినిమా పేరు బఫూన్. క్రేజీ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దగ్గర అసోసియేట్ గా చాలా సినిమాల్లో పనిచేసిన అశోక్ వీరప్పన్ ఈ సినిమాతో దర్శకుడిగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. కార్తిక్ సుబ్బరాజు సమర్ఫణలో, కార్తికేయన్ సంతానం, సుధన్ సుందరం, జయరామన్ నిర్మాణంలో .. సంతోష్ నారాయణ్ సంగీత సారధ్యంలో ఈ సినిమా రూపొందనుంది.
నేడు ‘బఫూన్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. రెడ్ డ్రెస్ లో రివీలైన వైభవ్.. ఓ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇచ్చే లుక్ ఆకట్టుకుంటోంది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ‘బఫూన్’ వైభవ్ కు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- యన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో విలన్ గా లంకేశ్?

So Happy & Proud to Present #Buffoon – Debut directorial of my associate dir @ashokveerappan starring @actor_vaibhav @AnaghaOfficial
A @Music_Santhosh musical…
Coming Soon to Theatres!!
@StonebenchFilms @kaarthekeyens @sudhans2017 @PassionStudios_ @DKP_DOP pic.twitter.com/hTeMCmQsNR
— karthik subbaraj (@karthiksubbaraj) March 29, 2021











