తమిళ స్టార్ డాటర్ వరలక్ష్మీ శరత్ కుమార్ .. ఈ ఏడాది తెలుగు లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుక గా రవితేజ హీరోగా వచ్చిన ‘క్రాక్’ లో నెగెటివ్ రోల్ లో జయమ్మ గా సూపర్ పెర్ఫార్మర్ అనిపించుకున్న వరూ .. ఆ తర్వాత వచ్చిన అల్లరి నరేశ్ ‘నాంది’ లో పాజిటివ్ గా డిఫెన్స్ లాయర్ అవతారమెత్తి అందులోనూ బెస్ట్ అనిపించుకుంది. ఇలా పాజిటివ్ అండ్ నెగెటివ్ రోల్స్ చేస్తూ తెలుగులో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ కొరటాల శివ కాంబో మూవీలో కూడా విలనిజంతో కూడిన పొలిటీషియన్ గా నటించబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే.. జయమ్మ ఓ హారర్ మూవీతో త్వరలో భయపెట్టనుండడం విశేషాన్ని సంతరించకుంది.
నేడు వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటించబోయే హారర్ మూవీ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇచ్చారు మేకర్స్ . హరీశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కాంచన కోనేరు నిర్మాణంలో డార్లింగ్ స్వామి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. వరలక్ష్మి తీక్షణంగా చూస్తున్న లుక్ తో .. బ్యాక్ గ్రౌండ్ లో ఓ హాంటింగ్ హౌస్ కనిపిస్తుంది. మరి ఇందులో ఆమె దెయ్యంగా నటిస్తోందో లేక .. వేరే ప్రధాన పాత్రలో నటిస్తోందో తెలియదు కానీ.. ఆమె కు హారర్ జోనర్ మాత్రం నిజంగా కొత్తే. ఇక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Must Read ;- బన్నీకి విలన్ గా ‘క్రాక్’ జయమ్మ?
Announcement 📢#KoneruSatyanarayana presents,
A Havish Production #ProductionNo1 as Talented actress @varusarath5 lead in the direction of #DarlingSwamy.Produced by #KanchanaKoneru
@idhavish #MuraliKrishnaKodali #GandhiNadikudikar #AmarReddy#HBDVaralaxmi pic.twitter.com/sLlPLducXr— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 5, 2021











