ప్రముఖ తమిళ దర్శకుడు, జర్నలిస్ట్, సినిమాటోగ్రాఫర్ కె.వి.ఆనంద్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఆయన శుక్రవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఇటీవల ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ ను కోల్పోయిన కోలీవుడ్ పరిశ్రమ ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోకుండానే మరో ప్రముఖ వ్యక్తిని కోల్పోయింది. వెంట వెంటనే ఇద్దరు వ్యక్తుల్ని కోల్పోవడం కోలీవుడ్ పరిశ్రమకు తీరని లోటే.
కె.వి.ఆనంద్ ‘తేన్మావిన్ కొంబత్తు’ అనే మలయాళ చిత్రంతో సినిమా టో గ్రాఫర్ గా తన పినీ కెరీర్ ను ప్రారంభించారు. ఆ సినిమాతోనే ఆయన జాతీయ అవార్డు ను సైతం అందుకున్నారు. ఎన్నో తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలకు ఆయన కెమేరా మేన్ గా వ్యవహరించారు. మోహన్ బాబు నటించిన పుణ్యభూమి నాదేశం చిత్రానికి ఆయనే కెమేరా మేన్. ‘కో, అయాన్, మాట్రన్ , అనేగన్, కవన్, కాప్పాన్’ లాంటి తమిళ చిత్రాలతో సౌత్ ప్రేక్షకుల్ని అలరించారు. కె.వి. ఆనంద్ మృతికి తమిళ చిత్ర ప్రముకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Must Read ;- కరోనాతో దర్శకుడు సాయిబాలాజీ కన్నుమూత