స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ, సుక్కు కాంబినేషన్ లో రూపొందిన ఆర్య, ఆర్య 2 సినిమాలు సక్సస్ అవ్వడంతో వీరిద్దరూ కలిసి చేస్తున్న మూడవ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి ఫారెస్ట్ లో షూటింగ్ చేసారు. యూనిట్ మెంబర్స్ లో కొంత మందికి కరోనా రావడంతో యూనిట్ హైరదాబాద్ వచ్చేసింది. తాజాగా హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
అయితే.. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది కానీ.. విలన్ ఎవరు అనేది ప్రకటించలేదు. ముందుగా ఈ సినిమాలో విలన్ పాత్రకు తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆతర్వాత బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ పేరు వినిపించింది. ఆతర్వాత సుదీప్, నారా రోహిత్, మాధవన్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. వీళ్లల్లో ఎవరిని కన్ ఫర్మ్ చేయలేదు. ఫైనల్ గా తమిళ హీరో ఆర్యను ఫైనల్ చేసినట్టు సమాచారం.
బన్నీ, ఆర్య కలిసి వరుడు సినిమాలో నటించారు. ఈ సినిమా వచ్చి దాదాపు పదేళ్లు అవుతుంది. ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరు కలిసి నటిస్తున్నారు. ఇటీవల ఆర్యని కాంటాక్ట్ చేసి ఈ సినిమాలో అతని క్యారెక్టర్ గురించి చెప్పారు. అయితే.. రీసెంట్ గా ఆర్య ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారని తెలిసింది. ఆర్యతో పాటు సునీల్ కూడా ఈ మూవీలో నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
Must Read ;- బన్నీ గురించి వనితా విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!