వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫ్యాన్ పార్టీ నేతలు అడ్డగోలుగా విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేశారనే ఆరోపణలు నిజమవుతున్నాయి. ఇటీవలే తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన భూ వివాదాలు, ఆక్రమణ ఆరోపణలు సంచలనం సృష్టించగా, తాజాగా శాసనసభ మాజీ స్పీకర్, సీనియర్ నేత తమ్మినేని సీతారాం కుటుంబంపై తీవ్రమైన భూ కబ్జా, ఫోర్జరీ కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
తమ్మినేని కుటుంబంపై నమోదైన ఈ భూ కబ్జా కుట్ర కేసు వివరాలు అత్యంత దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. భూమి అసలు యజమాని ప్రాణాలతో బ్రతికి ఉండగానే, ఆయన మ*రణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించారు. ఆపై తప్పుడు వారసత్వ పత్రాల ఆధారంగా కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు పక్కాగా స్కెచ్ వేశారు. బాధితుడైన అసలు యజమాని కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భారీ కుట్ర బట్టబయలైంది.
ఈ కేసులో పోలీసులు సమగ్ర విచారణ జరిపి దాఖలు చేసిన FIRలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ప్రధాన నిందితులుగా చేర్చారు. తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌ను A-5గా, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను A-6గా, ఆయన భార్య తమ్మినేని వాణిని A-7గా పోలీసులు ఈ కేసులో నమోదు చేశారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న సమయంలోనే ఇలాంటి దారుణమైన ఫోర్జరీ, కబ్జా కుట్రలకు తెరతీశారనే ఆరోపణలు రావడంతో తీవ్ర కలకలం రేగుతోంది.
కేసు పురోగతిపై జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ స్పందిస్తూ కీలక వివరాలు వెల్లడించారు. నకిలీ పత్రాల సృష్టి, ఫోర్జరీ, కబ్జాతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. బ్రతికి ఉన్న వ్యక్తిని చ*నిపోయినట్లు చూపి, ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసేందుకు వెనుక పెద్ద నెట్‌వర్క్ పనిచేసిందని, ఎంతటి వారని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం A-5, A-6, A-7 నిందితులుగా ఉన్న తమ్మినేని కుటుంబ సభ్యుల పాత్రపై పూర్తిస్థాయి సాంకేతిక, డాక్యుమెంటరీ ఆధారాలను సేకరిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తిరుపతిలో భూమన నుంచి మొదలుకొని ఇప్పుడు శ్రీకాకుళంలో తమ్మినేని వరకు వైసీపీ నేతల











