ఆమె… ఆటతో హడలెత్తిసుంది. అందంతో పిచ్చెక్కిస్తుంది. చందరంగంతో ఎదుటి వాళ్ల మెదళ్లను తులనాడుతుంది. హాట్ హాట్ పిక్స్ తో కుర్రకారు మదిని మత్తెక్కిస్తుంది. సినిమా స్టార్ల కంటే తానేమీ తీసిపోనని నిరూపిస్తోంది. మరో అడుగు ముందుకేసి… హీరోయిన్లకే అందంతో సవాల్ విసురుతోంది. ఆమె 34 ఏళ్ల చెస్ క్రీడాకారిణి తానియా సచ్ దేవ్. ఇటీవల ఆమె ఇన్ స్టాగ్రామ్ మత్తెక్కిచ్చే ఫొటోలతో నిండిపోతోంది.
చెస్… అనగానే మనకు గుర్తొచ్చేది విశ్వనాథన్ ఆనంద్, కొనేరు హంపి, హరికృష్ణ, ద్రోణవల్లి హరిక. భారత్ నుంచి రాణించే వాళ్లలో వీరి పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. వీరందరూ తెలుగువారే కావడం కూడా ఓ కారణం కావచ్చు! అయితే.. భారత్ నుంచి చదరంగంలో రాణిస్తున్న ప్లేయర్లలో తానియా సచ్ దేవ్ కూడా ఒకరు. ఆమె సైతం తన మేథస్సుతో ఇప్పటికే పలుసార్లు టైటిళ్లు గెలిచింది. దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.
తానియా సచ్ దేవ్… ఆరేళ్ల వయస్సులోనే చెస్ లోకి అడుగుపెట్టింది. 34 ఏళ్ల తానియా 2005 లో వుమెన్ గ్రాండ్ మాస్టర్స్ టైటిల్ గెలిచింది. 2008లో ఇంటర్నేషనల్ మాస్టర్స్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆటతో పాటు అదిరిపోయే అందంతో ఆకట్టుకుంటోది తానియా. హీరోయిన్లను తలదన్నే అందంతో మెరిసిపోతోంది. తానియా ప్రస్తుతం చెస్ కామెంటేటర్, ప్రజెంటర్ గా పనిచేస్తున్నారు. తన హాట్ పిక్స్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది.
Must Read ;- సన్నీ సిక్సర్.. ఇంగ్లాండ్తో సిరీస్ లో హాట్ బ్యూటీ!












