కరోనా కారణంగా రైల్వే వ్యవస్థ రైల్ సర్వీసులను రద్దు చేసింది. అప్పటి నుండి సామన్యుడి బండిగా పేరు గాంచిన రైల్ కూత ఆగిపోయింది. ఈ మధ్య కొన్ని సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ పర్యాటన కేంద్రాల ప్రత్యేక సర్వీసులను మాత్రం ప్రారంభించలేదు. అందులో భాగంగా, అరకుకు రైల్వే సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు రైల్వే యంత్రాంగం ప్రకటించింది.
Mead Read ;- అరకుకు పంపిప్తా అంటున్న కొండపల్లి వీరప్పన్
అరకు అందాలు అద్భుతః
వావ్! అరకును చూసిన తర్వాత ఎవరైనా ఈ మాట అనాల్సిందే. అంతటి అద్భుతమైన ప్రాంతం అరకు, ముఖ్యంగా ఈ కాలంలో అరకు అందాలు తిలకించడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. కానీ కరోనా కారణంగా సందర్శనకు వెళ్లాలన్నా సరైనా రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. అలాంటి వారికి ఓ చల్లని కబురు చెప్పారు రైల్వే సిబ్బంది.
ట్రైన్స్ సర్వీసులు
ట్రైన్ నెం: 08514 సర్వీసు వైజాగ్-కిరందుల్ మధ్య డిసెంబర్ 18 నుండి ప్రారంభాకానున్నాయని ప్రకటించారు. ఈ ట్రైన్ వైజాగ్‌లో ఉదయం 06:45 కి మొదలై, అదే రోజు రాత్రి 08:45 కు చేరుకుంటుందని రైల్వే సిబ్బంది ప్రకటించారు. ఈ ట్రైన్ ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. కిరందుల్ నుండి తిరిగి వైజాగ్‌కు రావాలనుకునే వారు ట్రైన్ నెం: 08513 అనే నెంబర్ రైలు ఉదయం 6 గంటలకు మొదలై, అదే రోజు రాత్రి 08:20 నిమిషాలకు వైజాగ్ చేరుకుంటుంది. ఇది డైలీ సర్వీస్‌గా పనిచేస్తుంది. ఈ ట్రైన్ డిసెంబర్ 19 ఉదయం నుంచి మొదలుకానుంది. ఈ సర్వీసులను ముందుగా రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి.
Also Read ;- జీవనశైలి, రోగ నిరోధక శక్తి.. కరోనాకు ఆ నాలుగు పల్లెలు దూరం