పెదగార్లపాడు మాజీ సర్పంచ్ అంకులు దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలోని ఓ అపార్టుమెంటులో దారుణ హత్యకు గురయ్యారు. పెదగార్లపాడు గ్రామానికి 10 సంవత్సరాలపాటు అంకులు సర్పంచ్ గా వ్యవహరించారు. నిర్మాణంలో ఉన్న అపార్టుమెంటు వద్ద అంకులు ఉండగా గమనించిన గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి చంపడం పల్నాడులో సంచలనం సృష్టించింది. వైసీపీ నేతలే ఈ దారుణానికి ఒడిగట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

పోలీసులే పిలిపించారా?
పెదగార్లపాడులో ఉన్న అంకులుకు సాయంత్రం ఓ ఫోన్ కాల్ వచ్చిందని, వెంటనే కారులో దాచేపల్లికి వెళ్లారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులే ఫోన్ చేసి అంకులును దాచేపల్లికి రప్పించారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెదగార్లపాడులో గతంలో ఫ్యాక్షన్ హత్యలు జరిగిన నేపథ్యంలో ఎన్నడూ అంకులు ఒంటరిగా తిరిగిన సందర్భం లేదని కుటుంబసభ్యులు వాపోతున్నారు. అయితే అంకులును కావాలనే పోలీసులు దాచేపల్లికి అర్జెంటుగా రావాలని ఫోన్ చేసి రప్పించారని వారు ఆరోపిస్తున్నారు. దాడి ఘటనపై గురజాల ఎమ్మెల్యే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, పెదగార్లపాడు వైసీపీ నేతలే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆయన ఆరోపించారు. ఇవాళ అంకులు కుటుంబసభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరామర్శిస్తారని యరపతినేని వెల్లడించారు.
మృతి చెందిన అంకులు బామ్మర్ది
టీడీపీ నేత పురం శెట్టి అంకులు కుటుంబం లో మరో విషాదం చోటుచేసుకుంది. అంకులు హత్య నేపథ్యంలో మనోవేదనకు గురైన కుటుంబ సభ్యులు . జరిగిన ఘటనను తట్టుకోలేక మానసిక వ్యధకు గురై.. హఠాత్తుగా కుప్పకూలిన అంకులు బామ్మర్ది శ్రీనివాస్. ఆ తర్వాత కొద్దిసేపటికే మృతి చెందిన శ్రీనివాస్. ఈ సంఘటనతో దాచేపల్లి మండలం పెదగర్లపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read: కత్తితో దాడికి తెగబడ్డ వైసీపీ నేత











