ములుగు ఎమ్మెల్యే సీతక్క… తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎంతోమందికి సుపరిచితం. ఆమె పేరు తెలియనివారు చాలా అరుదు అనే చెప్పాలి. ఒక పేద కుటుంబం.. ఆపై నక్సలైక్ బ్యాక్ గ్రౌండ్ వచ్చిన సీతక్క రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ఆదివాసీలు, గిరిజనులు ఎదుర్కోంటున్న సమస్యలపై పోరాడుతూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఒకవైపు కరోనా మహమ్మారి.. మరోవైపు లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది ఆదివాసీలు ఇంటికే పరిమితిమైతే.. క్లిష్ట సమయంలోనూ నేనున్నాంటూ పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఎడ్ల బండ్లపై కాన్వాయ్ గా చేసుకొని ఎన్నో గిరిజనగూడెలను తిరిగి, ఇంటింటికీ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పేదల కోసం కరోనాను చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని ప్రభుత్వంపై పోరాటం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించే ఎమ్మెల్యే సీతక్క పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
సీతక్క సేవలకు బాబు కితాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఇతర పార్టీల నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తారని పేరుంది. చంద్రబాబు వద్ద రాజకీయ ఓనమాలు నేర్చిన ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు.. నేడు ఇతర పార్టీల్లో కొనసాగుతున్నారు. తెలుగు నేల రెండు ముక్కలుగా విడిపోయినా.. చంద్రబాబుతో మంచి సంబంధాలు కలిగిన నేతల జాబితా పెద్దదే అని చెప్పక తప్పదు. బాబును అభిమానించేవాళ్లలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ముందుంటారు. గతంలో చంద్రబాబు హయాంలో టీడీపీలో పనిచేయడమే అందుకు కారణం. శుక్రవారం సీతక్క పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు విషెస్ చెప్పారు. ‘‘గిరిజనుల, ఆదివాసీల, పేదల బాధలు తీర్చడానికి అహర్నిశలు శ్రమించే మీ సేవాగుణం స్ఫూర్తిదాయకం. ప్రజలే సర్వస్వంగా భావించే మీరు నిండు నూరేళ్ళూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’’ అంటూ చంద్రబాబు ఆత్మీయమైన ట్వీట్ చేశారు.
బాబు నా ఆత్మీయ సోదరుడు
ఎన్నో ఏళ్ల నుంచి సీతక్క, చంద్రబాబు మధ్య మంచి సంబంధాలున్నాయి. ఇటీవల సీతక్క తల్లి ఆసుపత్రిలో ఉన్న సమయంలో చంద్రబాబు తల్లి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. పేదలకు చేస్తున్న సేవలను డాక్టర్లకు వివరించి సీతక్కపై తన ప్రేమను చాటుకున్నారు. అంతే బదులుగా సందర్భం వచ్చినప్పుడుల్లా ‘చంద్రబాబు నా ఆత్మీయ సోదరుడు’ అంటూ సీతక్క అభివర్ణిస్తుంటారు. పార్టీలు వేరయినా.. ప్రాంతాలు వేరయినా.. వీళ్లిద్దరి మధ్య బంధం కొనసాగుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఆసక్తికరమే..
Must Read ;- అమ్మకు ఏమి కాదు.. సీతక్కకు ధైర్యం చెప్పిన చంద్రబాబు
Thank you so much @ncbn anna 🙏 https://t.co/G3QGn97R1N
— Danasari Seethakka (@seethakkaMLA) July 9, 2021











