పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. 2024 ఏపీలో అధికారం వైపు
అడుగులేస్తున్న పవన్ కళ్యాణ్ మిత్రబలంతో కృష్ణా జిల్లాలో నాలుగో విడత యాత్రను ప్రారంభించబోతున్నారు. చంద్రబాబు జైలుకెళ్లాక ఆయన్ను పరామర్శించి ఎన్నికల పొత్తు ప్రకటించిన పవన్‌కు కృష్ణా జిల్లా యాత్ర అత్యంత కీలకం కాబోతోంది. వారాహి యాత్ర ప్రారంభించక ముందు జనసేన వేరు… యాత్ర మొదలయ్యాక జనసేన బలం అంతకంతకూ పెరిగిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
వ్యూహం ఏదైనా కావచ్చు.. కానీ పవన్ కళ్యాణ్‌కు ఈ నాలుగో విడత యాత్ర నిస్సందేహంగా అంతకంటే రెట్టింపు బలానిస్తుంది. పార్టీకి పెద్దదిక్కు జైల్లో ఉన్నా లోకేశ్, బాలయ్యలు జనజేన పొత్తుతో ఎదురయ్యే పరిణామాలు, ఎదుర్కోవాల్సిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాక అధినేత ఆదేశాలతో తమ కేడర్‌ను సైతం జనసేనతో కలసిపోయేలా పక్కా ప్లాన్ తో టీడీపీ అడుగులు ముందుకేస్తోంది. ఇందుకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ కేడర్ ను కూడా జనసేన సైన్యంతో కలసి వారాహియాత్రలో పాల్గొనాల్సిందిగా ఆదేశాలు ఇవ్వటం ఆసక్తికరపరిణామం. ఇప్పటికే తమ అధినేతను జైల్లో పెట్టించిన జగన్ పై కత్తులు దూస్తున్న టీడీపీ కేడర్ జనసేన సైన్యంతో కలసి పోవడం 2024 ఎన్నికలకు ముందు ఓ ఆసక్తికర పరిణామం.
బలంగా ప్రజల్లో నాటుకుపోయిన ఓ పార్టీ శ్రేణులు, కొత్తగా బలపడుతున్న మరో పార్టీ కేడర్
కలసి అడుగులేయటం అంత సులువైనదేమీ కాదు. తమకు గుర్తింపు దక్కలేదని పార్టీ నేతలు,
తమను తొక్కేస్తున్నారని మరొక పార్టీ అభిమానులు తన్నుకున్న సందర్భాలు గతంలో కోకొల్లలు.
అయితే ఇప్పడు తెలుగుదేశం – జనసేన నాయకులు, శ్రేణుల మధ్య అలాంటి చిక్కులెక్కడా ఎదురుకాకకపోవటం ఆసక్తికర పరిణామం. పొత్తులు లెక్కలు తేలక ముందే జనసేన – టీడీపీ కలసి
పోవాలన్న అద్భతమై ఆలోచనతో భవిష్యత్ లో ఎదురయ్యే ప్రమాదాలకు ముందే చెక్ పెట్టినట్టయింది. ఎన్నికల ముందే ఈక్వేషన్స్ సెట్ అయితే ప్రత్యర్థిని దెబ్బతీయటం ఈజీ అన్న ప్లాన్ లో భాగంగానే
తెలుగుదేశం ఇలా అడుగులు ముందుకేస్తోంది.
చంద్రబాబు డైరెక్షన్ లో లోకేశ్, బాలయ్యలు తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత రెండు పార్టీల నేతలు
కొత్త ఉత్సహాన్ని ప్రకటిస్తున్నారు. అదే జోష్.. అవనిగడ్డలో మొదలైన నాలుగో విడత వారాహియాత్రలోనూ కనిపించింది. కళ కోల్పోతుందంటూ తెలుగుదేశం పార్టీపై చిందులు తొక్కుతున్న జగన్ అండ్ కో కు ఇదో పెద్ద షాక్ అని ఎనలిస్టుల విశ్లేషణ. ఇదే ఉత్సాహం మిగతా చోట్ల జరిగే వారాహి యాత్రల్లోనూ కొనసాగితే 2024 ఎన్నికల్లో విజయం కష్టమేమీ కాదని వారి అభిప్రాయం. ఈ కలయిక ద్వారా ప్రత్యర్థులకు కొత్త సంకేతాలూ పంపే అవకాశాలు లేకపోలేదని ఇప్పడే వారంతా ఓ అంచనాకొచ్చేస్తున్నారు.











