ఖరీఫ్ సాగు ప్రారంభంలో మార్కెట్లో నకిలీ విత్తనాలు అమ్మకుల జోరుగా సాగుతున్నాయి. కర్నూల్ కేంద్రంగా నకిలీ విత్తనాల సరఫరా జరుగుతోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అధికారులు, వ్యాపారులతో కుమ్మక్కై దందా కొనసాగిస్తున్నారని ఆరోపణలపై టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘మార్కెట్లో యథేచ్ఛగా నకిలీ పత్తి విత్తనాలు. ప్యాకెట్లలో వివిధ పేర్లతో జోరుగా లూజు విత్తనాల విక్రయాలు .ఏటా నష్టపోతున్న రైతులు. నామమాత్రపు దాడులతో సరి. దళారులతో కుమ్మక్కై లబ్ది. ధరలు లేక ఇబ్బందులు పడుతుంటే నకిలీలతో మరింత నష్టం. అక్రమార్కులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి?’’ అంటూ ట్వీట్ చేశారు.
Must Read ;- పోలవరం పనులు పడకేశాయి: దేవినేని ఉమ
మార్కెట్లో యథేచ్ఛగా నకిలీ పత్తి విత్తనాలు. ప్యాకెట్లలో వివిధ పేర్లతో జోరుగా లూజు విత్తనాల విక్రయాలు .ఏటా నష్టపోతున్న రైతులు. నామమాత్రపు దాడులతో సరి. దళారులతో కుమ్మక్కై లబ్ది. ధరలు లేక ఇబ్బందులు పడుతుంటే నకిలీలతో మరింత నష్టం. అక్రమార్కులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి?@ysjagan pic.twitter.com/FZxxZNPWh9
— Devineni Uma (@DevineniUma) June 9, 2021