కరోనాకు మరో నాయకుడు బలయ్యారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,మైనార్టీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎండీ హిదాయత్ కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందారు.గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాకు కొంత కాలంగా చికిత్స పొందుతున్న ఎండీ హిదాయత్ గతరాత్రి చనిపోయారు.హిదాయత్కు కరోనా సోకిన విషయం తెలసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వారం కిందట ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.హిదాయత్ కుటుంబ సభ్యులకు కూడా చంద్రబాబు ధైర్యం చెప్పారు.అవసరం అయితే హిదాయత్ను హైదరాబాద్ తరలించి మెరుగైన చికిత్స అందించడానికి వెనకాడేది లేదని చెప్పారు.
రాయపాటి శిష్యుడిగా ప్రస్ధానం
మాజీ ఎంపీ రాయపాటి శిష్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభిరంచిన హిదాయత్,రాయపాటి టీడీపీలోకి రావడంతో ఆయనతో పాటే పయనించారు.రాయపాటి చొరవతో టీడీపీ ప్రభుత్వ హయాంలో మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యారు. హిదాయత్ మృతి పట్ల పలువురు టీడీపీ నాయకులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Must Read ;- మాజీ డీజీపీ ప్రసాదరావు మృతి : ప్రముఖుల సంతాపం