టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కేంద్ర ఎన్నికల కమిషనర్ అరోరాకు ఈ మేరకు లేఖ రాశారు. వరదయ్యపాలెం మండలంలో వైసీపీ ఎమ్మెల్యేలు వాలంటీర్లతో రహస్య సమావేశం నిర్వహించిన వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన లేఖలో కోరారు. దీనిపై పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్లులను లేఖకు జతచేశారు. ప్రభుత్వం సొమ్ముతో జీతాలు తీసుకుంటూ వైసీపీకి ఎలా పనిచేస్తారని టీడీపీ నేత వర్ల రామయ్య రాసిన లేఖలో ప్రశ్నించారు. తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు నియామకం కూడా నిలిపివేయాలని లేఖలో కోరారు.
కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగానే ఈ నెల 2న టీటీడీ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులను నియమించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని టీడీపీ నేత వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికలు పరిశీలించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేని అధికారిని నియమించాలని వర్ల రామయ్య రాసిన లేఖలో సీఈసీని విజ్ఙప్తి చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం కాకుండా చూడాలని లేఖలో ఆయన కోరారు.
Must Read ;- స్వామి భక్తిని చాటుకున్న రమణ దీక్షితులు..