ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై జనం తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతిని ప్రశ్నిస్తే కేసులు, ఎదిరిస్తే సంకెళ్లు అన్నట్లుగా సాగుతోందని ఆరోపించారు. ఆనందయ్య మందు పంపిణీలో వైసీపీ నేతలు జోక్యం చేసుకుంటున్నారని, వెబ్ సైట్ పేరుతో కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఇప్పటికే చెవిరెడ్డితో పాటు కొంతమంది వైసీపీ నాయకులు ఆనందయ్య మందును పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. కుట్రలను ప్రశ్నించిన సోమిరెడ్డిపై కేసులు పెట్టారని అన్నారు. ధూళిపాళ్లపై మరో కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో నియంత పాలన కొనసాగిస్తున్న జగన్ రెడ్డిపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లలోనే ఉన్నాయని యనమల హెచ్చరించారు.
Must Read ;- ఆనందయ్య కంటి మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్