కర్నూలు జిల్లా గడివేముల మండలం, పెసరవాయి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పెసరవాయి గ్రామానికి చెందిన టీడీపీ నేతలు వడ్డు ప్రతాపరెడ్డి, వడ్డు నాగేశ్వరరెడ్డిలను ఈ ఉదయం 7 గంటల సమయంలో ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. సహకా సంఘం మాజీ అధ్యక్షుడు వడ్డు ప్రతాపరెడ్డి, పెసరవాయి మాజీ సర్పంచ్ వడ్డు నాగేశ్వరెడ్డి స్వయానా అన్నదమ్ములు. వీరి మరో సోదరుడు వడ్డు మోహన్ రెడ్డి మూడు రోజుల కిందటే మరణించారు. దశదిన కార్యక్రమాల నిమిత్తం శ్మశానానికి వెళుతున్న సమయంలో బొలేరోలో వచ్చిన ప్రత్యర్థులు కారుతో వారిని ఢీకొట్టారు. అనంతరం వారిపై వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ప్రతాప్ రెడ్డి, నాగేశ్వరరెడ్డిలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ దాడిలో మృతుల వెంట ఉన్న సమీప బంధువుల్లో వడ్డు వెంకటేశ్వరరెడ్డితో పాటు మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన పెసరవాయి చేరుకున్నారు. టీడీపీ నేతల జంట హత్యల నేపథ్యంలో గ్రామంలో ఘర్షణలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియారలేదు.
ఉలిక్కపడ్డ కర్నూలు జిల్లా
పొద్దుపొద్దున్నే పెసరవాయి గ్రామంలో జంట హత్యలు జరగడంతో కర్నూలు జిల్లా ప్రజలు ఉలిక్కపడ్డారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి టీడీపీ నేతలపై జరుగుతున్న వరుస దాడులు, హత్యలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని, స్థానిక సంస్థల్లో పోటీ చేసిన వారిని… ప్రత్యేకించి టీడీపీ తరఫున నిలిచిన వారిని టార్గెట్ చేసుకున్న వైసీపీ నేతలు తమదైన శైలి దాడులకు తెగబడుతున్న వైనంపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నాయి. అయినా ఏమాత్రం వెనక్కు తగ్గని వైసీపీ నేతలు… టీడీపీ నేతలు, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కార్యకర్తలు, మరీ ముఖ్యంగా గ్రామాల్లో టీడీపీకి గట్టి మద్దతుదారులుగా నిలుస్తున్న వారిపై యథేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారు. ఈ క్ర మంలో రాజకీయ హత్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Must Read ;- టీడీపీ నుంచి పోటీచేసినందుకు దాడి,అక్రమ కేసు.. పోలీస్ స్టేషన్ ఎదుట గర్భణి ఆందోళన











