TDP Song On Jagan Ruling Viral On Social Media :
వైఎస్ జగన్.. ఒక్క ఛాన్స్ అంటూ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మభ్య పెట్టి సీఎం పీఠమెక్కారు. నిరుద్యోగులను ముంచారు.. ప్రత్యేక హోదాను గాలికొదిలేశారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. ‘జగనన్న పాలన దేశానికే ఆదర్శం’ అనే గొప్పలు చెప్పుకునే నాయకులకు టీడీపీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. జగన్ రెండేళ్ల పాలనను వివరిస్తూ తెరకెక్కించిన ఓ పాట.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
‘‘కన్ను పొడుచుకున్నా కానరానంత అంధకారంలో ఆంధ్రప్రదేశ్ ను నెట్టేసింది జగన్ రెడ్డి పాలన. నమ్మినందుకు నీ వేలితోనే నీ కంటిని పొడిచిన జగన్ రెడ్డి గురించి ఆలోచింపజేసే హుషారైన పాటను మీకందిస్తున్నా’’ అంటూ తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సుప్రీంకోర్టు సుత్తితో కొట్టే.. రిజర్వ్ బ్యాంకు రూటుమార్చే.. ఇండస్ట్రీలు ఈడ్చికొట్టే.. పథకాలు పల్టీ కొట్టే అనే లిరిక్స్ ఎంతోమందిని ఆలోజింపచేస్తున్నాయి. పోస్ట్ చేసిన నిమిషాల్లోనే ఈ వీడియోకు వేల వ్యూస్ వచ్చాయి. ‘‘జగనన్నపాలనను చాలా చక్కగా వర్ణించారు బ్రదర్.. జగన్ కు ఇదే చివరి పాలన’ అంటూ నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం.
Must Read ;- టీడీపీ కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు!