ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టుకు బయోబబుల్ రూపంలో కొత్త చిక్కు వచ్చి పడింది. ఆంక్షల ఉల్లంఘన ఆరోపణలపై పలువురు భారత క్రికెటర్లను శనివారం ఐసోలేషన్‌కు పంపడం చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో ఆఖరి టెస్టు జరగనున్న బ్రిస్బేన్‌కు వెళ్లడానికి టీమ్ ఇండియా సుముఖంగా లేదని తెలుస్తోంది.
ఆఖరి టెస్టుపై నీలి నీడలు..
భారత్ – ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆఖరి టెస్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. న్యూ సౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. సరిహద్దులన్నిటిని మూసి వేసింది. ఈ నిబంధనల ప్రకారం మరోసారి టీమిండియా ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది. ఈ ప్రతిపాదనను క్రికెట్ ఆస్ట్రేలియా… టీమిండియా ముందుంచింది.
మరోసారి అంటే కష్టమే..
షెడ్యూల్ ప్రకారం బోర్డర్-గావస్కర్ ట్రోఫీలోని చివరి టెస్టుకు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియాన్ని వేదికగా నిర్ణయించారు. జనవరి 15 నుంచి 19 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. బ్రిస్బేన్‌లో కొవిడ్ ఉద్ధృతి, ఆంక్షల వల్ల భారత క్రికెటర్లు మరోసారి లాక్‌డౌన్‌లో ఉండాల్సి వస్తే అది వారి ఆటపై దుష్ప్రభావం చూపుతుందని టీమ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
బ్రిస్బేన్ వెళ్లడానికి సిద్ధంగా లేము!
ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లినప్పుడు.. ఆ తర్వాత ఆసీస్ పర్యటనలో సిడ్నీ చేరుకున్నాక 14 రోజుల చొప్పున దాదాపు నెల రోజులపాటు భారత జట్టు క్వారంటైన్లోనే ఉందని టీమిండియా చెబుతోంది. పర్యటన చివర్లో మరోసారి క్వారంటైన్‌కు వెళ్లాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. గ్రౌండ్లోకి కాకుండా మరోసారి హోటల్లో చిక్కుకునే పరిస్థితి ఉంటే బ్రిస్బేన్ వెళ్లడానికి తాము సిద్ధంగా లేమని పేర్కొంది. దాని బదులు వేరే ఏదైనా నగరంలో చివరి రెండు టెస్టులు ఆడి, సిరీస్ ముగించుకుని స్వదేశానికి తిరిగి వెళ్లడానికి తమకేం ఇబ్బంది లేదని టీమిండియా ప్రతినిధి ఒకరు చెప్పారు.
అసలేం జరిగిందంటే..?
విక్టోరియాలోని సీక్రెట్ కిచెన్ రెస్టారెంట్‌లో భోంచేయడానికి ఐదుగురు క్రికెటర్లు వెళ్లారు. నిబంధనల ప్రకారం బయట కూర్చోకుండా లోపలే అందరితో పాటు కలిసి తిన్నారు. అక్కడే కూర్చున్న నవల్దీప్ సింగ్ అనే అభిమాని ఇదంతా వీడియో తీశారు. వారి బిల్లు (రూ.6,700) తెప్పించుకుని కట్టేశాడు. రోహిత్ అతడి దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వబోతే… మనీ వద్దని చెబుతూ ఫొటో దిగాలని కోరాడు. ఇదంతా నవల్దీప్ ట్వీట్ చేయడంతో అసలు సమస్య వచ్చి పడింది.
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో బయోబబుల్ నిబంధనల ప్రకారం ఆసీస్- టీమిండియా టెస్టు టోర్నీ జరుగుతోంది. ఈ నిబంధన ప్రకారం ఆటగాళ్లు రెస్టారెంట్లకు వెళ్లినా అవుట్‌డోర్‌లో కూర్చుని తినాలి. కానీ మనవాళ్లు అలా కాకుండా లోపలే కూర్చుని తినడంతో కొత్త చిక్కు వచ్చింది. అందుకే ఈ విషయమై సీఏ, బీసీసీఐ విచారణకు ఆదేశించాయి. ఈనెల 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆడేందుకు రోహిత్, గిల్, పంత్‌లను అనుమతిస్తారా? అనే ప్రశ్నకు కూడా సీఏ నేరుగా సమాధానమివ్వలేదు.
Bc mere saamne waale table par gill pant sharma saini fuckkkkkk pic.twitter.com/yQUvdu3shF
— Navaldeep Singh (@NavalGeekSingh) January 1, 2021