తెలగాంణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు అగాధంలోకి వెళ్లి పోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సీట్లను టీఆర్ఎస్‌కు అప్పజెప్పింది. ఆ పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అయినా పెద్దగా ఆ పార్టీ పెద్దల నుండి స్పందన రాలేదు. టీఆర్ఎస్ తీరును ఎండగట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఒకరి తరువాత ఒకరు పార్టీ వీడుతున్నా కనీసం పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయినా ఆ పార్టీ పెద్దలు పోరాటాలు గాని, అడ్డుకునే ప్రయత్నం గాని చేయలేదు. ఆ తరువాత ఆ పార్టీ నేతలు పెద్దగా యాక్టీవ్‌గా లేకుండా అయిపోయారు. ఎవరో కొంత మంది మాత్రమే కార్యక్రమాలు చేస్తూ పార్టీని బతికించుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.
వారికి సహకారం ఏదీ..
ఎవరికి వారే ఎమునా తీరే అన్నట్టు తయారైంది కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి. పార్టీలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఎవరి కార్యక్రమాల్లో వారు బిజీ అయిపోయారు. ఎంపీలు , ఎమ్మెల్యేలు తలోదారి పట్టడంతో పార్టీ బ్రతకడం కష్టం అయ్యింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పెర్‌ఫార్మెన్స్ అంత చెప్పుకోదగ్గట్టుగా లేదంటూ వార్తలు వచ్చాయి. కొత్తగా ఇన్ ఛార్జిగా వచ్చిన మాణిక్కం ఠాగూర్ పార్టీని గట్టెక్కిస్తారని అంతా భావించారు. దుబ్బాక ఉప ఎన్నికలకు తన మార్క్ ప్లాన్ సిద్ధం చేశారు. గ్రామాలు, మండలాలకు ప్రత్యేకంగా ఇన్ ఛార్జిలను నియమించి టీఆర్ఎస్, బీజేపీకి ధీటుగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. మొదట ప్లాన్ బాగానే ఉందనిపించినా అమలు చేయడంలో ఆపార్టీ నేతలు శ్రద్ధ చూపలేదన్న విమర్శలు వచ్చాయి. ఇక సిద్దిపేటలో బండి సంజయ్ అరెస్ట్ తరువాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనక్కు వెళ్ళిపోయింది. అయినా ఆ పార్టీ అభ్యర్థి బలంతో చెప్పుకోదగ్గ ఓట్లను సాధించగలిగింది.
Must Read: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుచరుడు టీఆర్ఎస్‌లోకి జంప్
గ్రేటర్‌లో పూర్తిగా బోల్తా ..
గ్రేటర్ ఎన్నికల సమయం వచ్చే సరికి ఆ పార్టీ మరింత డీలా పడింది. గ్రేటర్‌లో కీలక నేతలంతా ఒక్కొక్కరు పార్టీ వీడుతున్నారు. మాజీ మేయర్ బండా కార్తిక దంపతులు బీజేపీలో చేరిపోయారు. ఆ పార్టీ కీలక నేత బిక్షపతి యాదవ్, ఆయన కుమారుడు రవి యాదవ్‌లు కూడా ఆ పార్టీని వీడారు. బీజేపీ జాతీయ నేత భూపేంద్ర యాదవ్ చేతుల మీదుగా వారు పార్టీ కండువాలు కప్పుకున్నారు. మరికొంత మంది శేరిలింగంపల్లికి చెందిన నేతలు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ ఖాళీ అయినట్టే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. బిక్షపతి పార్టీ మారకుండా ఆపేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తం, రేవంత్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు చివరి వరకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అంతా అయిపోయాక ఇప్పుడు మంతనాలు చేస్తే కలిగే ప్రయోజనం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read: హరీష్ ఈ లేఖ ముందే బయటపెడితే.. దుబ్బాక గెల్చేవాళ్లా?