‘ఉయ్యాలా జంపాలా’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ద్వారా తెలుగు తెరకి ‘పునర్నవి’ పరిచయమైంది. పల్లెటూరి అమ్మాయిలు ఎలా ఉంటారో అలాగే కనిపిస్తూ పునర్నవి ఆ పాత్రను చాలా సహజంగా చేసింది. అప్పటి నుంచి ఆమె చాలా సినిమాల్లో నటించిందిగానీ అంతగా గుర్తింపు రాలేదు. కొన్ని చిన్న సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు కూడా చేసింది. ఆ సినిమాలు అంతగా ఆడకపోవడం వలన, ఆమె పాత్రను గురించి ఎవరూ పట్టించుకోలేదు.

ఇలాంటి పరిస్థితుల్లోనే పునర్నవికి ‘బిగ్ బాస్ 3‘లో ఛాన్స్ వచ్చింది. ఆ సీజన్లో బిగ్ బాస్ హౌస్ కి పునర్నవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హౌస్ లో ఎంతమంది ఉన్నప్పటికీ అందరి దృష్టి పునర్నవిపై ఉండేది. ఈ అమ్మాయి సినిమాల్లో కంటే బిగ్ బాస్ హౌస్ లోనే బాగుందని కూడా అంతా అనుకున్నారు. అలా రోజురోజుకి ఈ అమ్మాయి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ఇక హౌస్ లో రాహుల్ సిప్లిగంజ్ తో పునర్నవి చనువుగా ఉండటం కూడా హాట్ టాపిక్ గా మారింది.
తనకి రాహుల్ మంచి స్నేహితుడు మాత్రమేనని ఆమె క్లారిటీ ఇచ్చినా, వాళ్ల మధ్య ఏదో ఉందనే ప్రచారం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక అశ్లీల యాప్ లో పునర్నవి ఫొటోలు ప్రత్యక్షం కావడంతో అంతా షాక్ అయ్యారు. తాజా ఇంటర్వ్యూలో పునర్నవి మాట్లాడుతూ, అవి కేవలం క్రియేట్ చేసినవి మాత్రమేనని స్పష్టం చేసింది. వేరే పేర్లతో కొంతమంది తన ప్రొఫైల్స్ క్రియేట్ చేశారనీ, విషయం తెలిసినప్పుడు తాను కూడా ఆశ్చర్యపోయానని అంది. ఆ తరువాత ఇలాంటివి సహజమేనని చెప్పేసి లైట్ తీసుకున్నానని చెప్పుకొచ్చింది.
Also Read: బిగ్ బాస్ వెనకున్న గాడ్ ఫాదర్ ఎవరు?











