మాస్ మహా రాజా రవితేజ – సక్సస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ క్రాక్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రాక్ మూవీ రికార్డు కలక్షన్స్ వసూలు చేసింది. 50 శాతం సిటింగ్ ఆక్యుపెన్సీతో కూడా 50 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం. ఈ సినిమాతో హీరో రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఫామ్ లోకి వచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర నిర్మాత ఠాగూర్ మధు సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
క్రాక్ రిలీజ్ రోజు మార్నింగ్ షోలు నిలిచిపోయాయి. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ కి నిర్మాత మధు డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో క్రాక్ రిలీజ్ రోజు మార్నింగ్ షోలు ఆగిపోవడం జరిగింది. ఆఖరికి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడంతో సెకండ్ షో నుంచి క్రాక్ షోలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు నిర్మాత మధు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. క్రాక్ బ్లాక్ బస్టర్ అయి రికార్డు కలెక్షన్స్ వసూలు చేసినప్పటికీ… డైరెక్టర్ మలినేని గోపీచంద్ కి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్లోని బ్యాలెన్స్ ఇవ్వలేదట.
ఎన్ని సార్లు అడిగినా నిర్మాత నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ నిర్మాత ఇవ్వలేదని.. తెలుగు దర్శకుల సంఘంకు డైరెక్టర్ గోపీచంద్ ఫిర్యాదు చేశారు. దీని పై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన బ్యాలన్స్ రెమ్యూనరేషన్ ఇప్పించాలని కోరాడు. గోపీచంద్ మలినేని ఫిర్యాదుతో దర్శకుల సంఘం విచారణ చేపడుతుంది.
Must Read ;- ‘క్రాక్’ డైరెక్టర్ నెక్ట్స్ మూవీ బాలయ్యతోనేేనా?