కరోనా వైరస్ సినిమాకే సినిమా చూపిస్తోంది. ఈ వైరస్ మూలంగా తెలుగు సినిమా రంగానికి ఎంత కష్టం ఎంత నష్టమో అంచనా వేయడం కూడా కష్టమే. గడిచిన ఆరు నెలలుగా ఎలాంటి కార్యకలాపాలూ లేక సినిమారంగం కుదేలైపోయింది. ఈ పరిశ్రమ మీదే ఆధారపడి బతుకుతున్న ఎంతో మంది తమ తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇప్పటికే సినిమాల మీద వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన నిర్మాతల బాధలు వర్ణనాతీతం. భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలను ఎలా విడుదల చేయాలో తెలియక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఓటీటీ ఉన్నా ఓదార్పు విడుదలకే పనికి వస్తుంది. అలా విడుదల చేస్తే వచ్చే డబ్బులు నిర్మాతలు తెచ్చిన వడ్డీలకు కూడా సరిపోవు. అటు నిర్మాణ వ్యవస్థ, ఇటు పంపిణీ వ్యవస్థ, మరో పక్క ఎగ్జిబిటర్ల వ్యవస్థ భారీ నష్టాలలో మునిగిపోయాయి. అప్పులు తెచ్చి మరీ సిబ్బందిని పోషించడం లేదా సిబ్బందిని వదిలించుకోవడం చేస్తున్నారు. రాష్ర్టవాప్తంగా ధియేటర్లన్నీ మూతపడ్డాయి. కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి. ఈ పరిస్థితి ఎప్పటికి సాధారణ స్థితికి వస్తుందో ఎవరికీ అంతుబట్టటం లేదు. వ్యాక్సిన్లు వచ్చినా జనం ధియేటర్లకు వస్తారా లేదా అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే జనం ఆర్థికంగా కుదేలైపోయారు. అందరూ అప్పులు కోసం ఎగబడేవారే. ముందు ఆ అప్పుల నుంచి బయటపడితేగాని వినాదానికి డబ్బులు వెచ్చించలేరు. ఇంట్లోనే సినిమాలు చూడటానికి అలవాటు పడిపోయారు.
24 క్రాఫ్ట్ లకూ ఇదే పరిస్థితి
సినిమా రంగంలో 24 క్రాఫ్ట్ లు ఉన్నాయి. వీటికి సంబంధించిన వారంతా ప్రత్యక్షంగా సినిమా రంగం మీద ఆధారపడి బతుకుతున్నవారే. వీరే కాకుండా పరోక్షంగా ఇంకెన్నో కుటుంబాలు ఉన్నాయి. అటు సినిమాకీ ఇటు మీడియాకూ, ప్రజలకూ వారధులుగాపనిచేస్తున్న పీఆర్వోలు, జర్నలిస్టులు కూడా కరోనా కోరల్లో నలిగిపోతున్నారు. అనుమతులు అడిగిన పెద్ద హీరోలు కూడా షూటింగులకు ముందుకు రావడం లేదు. పెద్ద హీరోల దయాదాక్షణ్యాల మీదే సినిమా షూటింగులు ఆధారపడి ఉన్నాయి. చిన్న సినిమాల షూటింగులు కూడా అరకొరగానే జరుగుతున్నాయి. ఈ రంగం మీద ఆధారపడి బతుకుతున్న వారిని ఆదుకోడానికి కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) అనే సంస్థ చిరంజీవి నేతృత్వంలో ఏర్పడి కొంత సహాయక చర్యలు చేపట్టినా అవి కొంతమేరకే. కేవలం రెండు మూడు దఫాలు నిత్యావసరాల పంపిణీని ఈ సంస్థద్వారా చేశారు. జులై నెలలో ఎలాంటి సహకారమూ అందలేదు. నిత్యం సందడిగా ఉండే హైదరాబాద్ లోని కృష్ణానగర్ లో నేడు ఆ కళాకాంతులు లేవు. సినీ కార్మికులంతా ఎవరి సొంతూళ్లకు వారు వెళ్లిపోయారు. షూటింగులకు అనుమతులు అడిగిన పెద్ద హీరోలు అనుమతులు ఇచ్చిన తర్వాత ఎందుకు ముందుకు రావడంలేదన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. షూటింగులే కాదు సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిస్థాయిలో జరగడంలేదు.
కరోనాతో కాలం ఫ్రీజ్
సినిమా రంగం ఎక్కడ ఆగిపోయిందో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభం కావాల్సిన వాతావరణం ఉంది. దాదాపు ఆరు నెలలుగా చిత్రసీమ అస్తవ్యస్తం అయిపోయింది. ఆరు నెలల వెనక్కి వెళితే మా సినిమా అంత కలెక్షన్లు వసూలు చేసింది… ఇంత వసూలు చేసింది అనే రికార్డుల మాటలే వినిపించేవి. ఇప్పుడంతా తారుమారు. చిత్రసీమ ఇంత కలవర పడే పరిస్థితి ఇంతకు ముందెన్నడూ జరగలేదు. సినిమా చరిత్రలో ఇంతకాలం సినిమా పరిశ్రమ స్తంభించిన దాఖలాలు లేవు. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ దాకా ఇదే వాతావరణం ఉంది. తెలుగులో విడుదలకు సిద్ధమైన ఎన్నో సినిమాలు అలానే ఉన్నాయి. పెద్ద నిర్మాతలు ఓటీటీలో విడుదల చేయడానికి ఇష్టపడటం లేదు. కరోనా అనేది లేకపోతే ఈపాటికే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిరంజీవి ‘ఆచార్య’, నాగార్జున ‘వైల్డ్ డాగ్’, వెంకటేష్ ‘నారప్ప’… ఇలా ఎన్నో సినిమాలు విడుదలకు నోచుకోలేదు. ఉప్పెన, నిశ్శబ్దం, లవ్ స్టోరీ, రెడ్, మోసగాళ్లు, సోలో బతుకే సో బెటర్, మిస్ ఇండియా, విరాటపర్వం, వి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, అల్లుడు అదుర్స్, ఎ 1 ఎక్స్ ప్రెస్, క్రాక్, సిటీమార్, టక్ జగదీష్, బంగారు బుల్లోడు, నాంది, 18 పేజెస్, రంగ్ దే… ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాల జాబితా చాలానే ఉంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రాజమౌళి చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్థంకావడం లేదు. మొదటిసారిగా రాజమౌళి రూపొందిస్తున్న మల్టీస్టారర్ చిత్రమిది. బాహుబలి తర్వాత భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఎస్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమా దాదాపు సగం షూటింగును పూర్తిచేసుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం షూటింగ్ చేయడంఇలాంటి భారీ సినిమాల విషయంలో సాధ్యం కాదు. సాధారణ జనంతో పాటు సినిమా జనమంతా కరోనా వ్యాక్సిన్ల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పెద్ద హీరోలు షూటింగులలో పాల్గొనే వాతావరణం కనిపించడం లేదు.
చైతు నా భర్త కాదు అంటూ సమంత సెన్సేషనల్ కామెంట్స్
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ఫేమస్ టాక్ షో `కాఫీ...