టాలీవుడ్లో యువ హీరోల్లో నితిన్ .. హీరోయిన్స్ లో కీర్తి సురేశ్ దూసుకుపోతున్నారు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘రంగ్ దే’ సినిమా రూపొందింది. దాంతో ఈ జంటను తెరపై చూసే సమయం కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందాల ఈ జోడీ తెరపై అలరించడానికి ఇంకా సమయం ఉంది. మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటివరకూ ఫ్యాన్స్ ను వెయిట్ చేయించడం ఇష్టంలేక, నితిన్ – కీర్తి సురేశ్ జోడీ స్టిల్ ను సంక్రాంతి సందర్భంగా తెలుగు వాకిట్లో ఆవిష్కరించారు.
ఈ ఫోటోలో నితిన్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తుంటే, కీర్తి సురేశ్ మరింత గ్లామరస్ గా అనిపిస్తోంది. సెల్ ఫోన్లో నితిన్ కి ఏదో చూపించి కీర్తి సురేశ్ చిరునవ్వులు చిందిస్తూ ఉంటే, నితిన్ కూడా చిరుమందహాసం చేస్తున్నాడు. ఇద్దరూ కూడా కలర్ఫుల్ గా కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. ‘మహానటి’ తరువాత కీర్తి సురేశ్ బరువు తగ్గడం వలన, ఆ తరువాత సినిమాలో ఆమె అంత ఆకర్షణీయంగా అనిపించలేదు. కానీ ‘రంగ్ దే‘ సినిమాలో బొద్దుగా కాకపోయినా బాగానే కనిపిస్తోంది. ఇద్దరూ కూడా ఇంతకుముందు కన్నా అందంగా కనిపిస్తూ, సంక్రాంతి జోడీ అంటే ఇదీ.. అనిపించేలా ఉన్నారు.
‘తొలిప్రేమ’ .. ‘మిస్టర్ మజ్ను’ వంటి ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. అందువలన ఈ సినిమా కూడా యూత్ ను దృష్టిలో పెట్టుకుని చేసే ఉంటాడు. అయితే ఇప్పటి ప్రేమకథలన్నీ కుటుంబ నేపథ్యంతో కలిసే సందడి చేస్తున్నాయి కనుక, అదే తరహాలో ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. క్రితం ఏడాది ‘భీష్మ‘ సినిమాతో హిట్ కొట్టిన నితిన్, ఈ ఏడాది ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను నమోదు చేస్తాడేమో చూడాలి.
Must Read ;- అఖిల్ డైరెక్టర్ తో నితిన్ మూవీ.. ఎవరా దర్శకుడు?