ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఈ ఏడాది రెడ్ మూవీ రిజల్ట్ తో కాస్తంత నిరాశ చెందాడు. బాక్సాఫీస్ వద్ద సినిమా మిశ్రమ ఫలితం రాబట్టింది. అందుకే తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ హీరో .. బైలింగ్విల్ మూవీస్ పై కాన్సన్ ట్రేషన్ పెట్టాడు.
ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుసామి దర్వకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ, తెలుగులో సైమల్ టేనియస్ గా రూపొందనుంది. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా మీద టాలీవుడ్ లో మంచి అంచనాలున్నాయి. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
ఇదిలా ఉంటే.. దీని తర్వాత రామ్ మరో బైలింగ్విల్ మూవీ టేకప్ చేసే అవకాశాలు న్నాయంటున్నారు. తమిళ బ్రిలియంట్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ రామ్ తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడని తెలుస్తోంది. నిజానికి మురుగదాస్ విజయ్ 65వ సినిమా చేయాల్సింది. అయితే ఆ ప్రాజెక్ట్ ఎందుకనో కేన్సిల్ అయి.. ఆ ఛాన్స్ నెల్సన్ దిలీప్ కుమార్ ఎగరేసుకుపోయాడు. దాంతో మురుగదాస్ ఇప్పుడు రామ్ తో సినిమా చేయాలనుకుంటున్నాడట. ‘స్టాలిన్,స్పైడర్’ తర్వాత మురుగదాస్ చేయబోయే స్ర్టైట్ తెలుగు సినిమా ఇదే అవడం విశేషం. త్వరలోనే ఈ సినిమా మీద రామ్ నిర్ణయం తెలుపుతాడట.
Must Read ;- ఇస్మార్ట్ కాప్ గా ఎనర్జిటిక్ స్టార్?