బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ లో గ్రాండ్ ఫైనల్ వరకు వచ్చి.. బాగా పాపులర్ అయిన కంటెస్టెంట్ సోహైల్. బిగ్ బాస్ హౌస్ లోకి సోహైల్ వచ్చినప్పుడు అంతగా ఆకట్టుకోకపోయినా.. ఆతర్వాత మాత్రం తనదైన స్టైల్ లో గేమ్ ఆడి అందరి మనసులు దోచుకున్నాడు. ఉత్కంఠగా జరిగిన ఫైనల్ లో అమౌంట్ తీసుకుని డ్రాప్ అయి మూడవ స్ధానంలో నిలిచాడు. అయితే.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓ చిన్న సినిమా తీస్తానని ప్రకటించాడు.
బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు వచ్చాడో లేదో వెంటనే సినిమాని ఎనౌన్స్ చేసాడు. అయితే.. తన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని రమ్మని పిలవడం.. ఆయన వెంటనే వస్తానని మాట ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా.. నువ్వు తీసే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఇవ్వు నేను చేస్తానని అందరి సమక్షంలో చిరంజీవి మాట ఇచ్చారు. దీంతో సోహైల్ తీసే సినిమా పై మరింత ఆసక్తి పెరిగిందని చెప్పచ్చు.
ఇదిలా ఉంటే.. ఇటీవల కరీంనగర్ లో సోహైల్ కు ఓ హోటల్ లో సన్మానం జరిగింది. ఈ వేడుకలో సోహైల్ మాట్లాడుతూ.. సింగరేణి పై సినిమా తీస్తానని ప్రకటించారు. తనకు ఓటు వేసి గెలిపించిన కరీంనగర్ ప్రజలందరికీ థ్యాంక్స్ తెలియచేశారు. వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అయ్యాడు సోహైల్. మరి.. సింగరేణి పై సోహైల్ సినిమాని నిర్మిస్తాడో లేక డైరెక్ట్ చేస్తాడో.. చూడాలి.
https://www.youtube.com/watch?v=-PtjkGAK6II











