తెలుగులో పాన్ ఇండియా సినిమాలుతో పాటు పాన్ ఇండియా స్టార్స్ కూడా తయారు అవుతున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా కాస్త పాన్ వరల్డ్ కూడా అయిపోయింది. తలైవా రజనీకాంత్ మాదిరిగా తెలుగు హీరో ప్రభాస్ కో కూడా ఇంటర్నేషనల్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంత వరకు ఏడాదికో సినిమా లేక రెండేళ్ళకో సినిమా చేస్తూ మెల్లిగా పాన్ ఇండియా స్థాయిలో ఫాన్స్ ని సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు వరస పెట్టి సినిమాలకి సైన్ చేయడానికి అసలు కారణం తనకు నేపాల్, భూటాన్, మలేసియాలో ఉన్న అభిమానులే కారణం అని తెల్సింది.
ప్రభాస్ యాక్ట్ చేసిన బాహుబలి 1&2 సినిమాలు నేపాల్ లో 8 కోట్లు షేర్ సాధించడం విశేషం. ఇక సాహో చిత్రం నేపాల్ లో 12 కోట్లు షేర్ సాధించి ఇప్పటికి అక్కడ అత్యధిక కల్లెక్షన్స్ తెచ్చుకున్న సినిమాగా నిలిచింది. ఇదే మాదిరి కలెక్షన్స్ ఆసియా లో ఉన్న చాలా దేశాల్లో ప్రభాస్ సినిమాలకి వస్తున్నాయి. దీంతో ప్రభాస్ తో తెలుగు నిర్మాతలే కాదు బాలీవుడ్ అగ్ర నిర్మాతలు కూడా సినిమాలు నిర్మించడానికి పోటీ పడుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలకు సైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజగా ప్రభాస్ 22వ సినిమాకి ఆదిపురుష్ అనే టైటిల్ పెట్టినట్లుగా అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సినిమాతో తొలిసారిగా ప్రభాస్ డైరెక్ట్ హిందీ మూవీ చేయబోతున్నాడు. హిందీ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా రెడీ అవుతుంది.