కల్తీసారా మరణాలపై న్యాయ విచారణను డిమాండ్ చేస్తూ తెలుగుదేశం శాశనసభాపక్షం వరుసగా నాలుగో రోజు నిరసనను దిగింది.అసెంబ్లీ ఆవరణలోని అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. జె బ్రాండ్ లతో జగన్ మోహన్ రెడ్డి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని జే బ్రాండ్ మద్యం, కల్తీసారా, గంజాయి, నార్కోటిక్స్ డ్రగ్స్ తో ముంచెత్తుతున్నాయన్నారు.నాసిరకం మద్యం, నాటుసారాతో మహిళల మంగల్యాలను జగన్ రెడ్డి తెంచుతున్నారని లోకేష్ ఆరోపించారు.అసెంబ్లీ సాక్షిగా అసత్య ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి జగన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే జంగారెడ్డి గూడెంలో 26 మంది చనిపోయారన్న ఆయన.. జగన్ మోహన్ రెడ్డి ఇంకెన్ని సారా చావులు కోరుకుంటున్నారని చెప్పాలన్నారు.జగన్ పాలనలో ఏపీలో కరోనా మరణాలతో పోటీగా కల్తీసారా మరణాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వానికి హై కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ