విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావును ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించారని కొందరు ఆందోళకు దిగారు. దీంతో ఎమ్మెల్సీ జగదీశ్వరరావు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. జగదీశ్వరరావును పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తోపులాటలో జగదీశ్వరరావుకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అక్కడ నుంచి పంపించివేయడంతో ఉద్రిక్తత సర్థుమణిగింది.
Must Read ;- ’ఉక్కు‘పై ప్రకటనతో వైసీపీ నేతలకు ముచ్చెమటలు.. గ్రేటర్ విశాఖలో అంచనాలు తారుమారు?