పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండంతో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో తమ స్పీడ్ పెంచాయి. దీంతో ఆయా పార్టీల ముఖ్య నేతలందరూ ప్రచారంలో పాల్గొంటున్నారు. రోడ్ షోలతో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూకట్‌పల్లిలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
ఎదురెదురుగా ఒకేసారి రెండు పార్టీలు ఎదురయ్యాయి. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు, ఇరువర్గాల నాయకులు కార్యకర్తలను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం రాజాసింగ్ టీఆర్ఎస్ పార్టీని ఉద్ధేశిస్తూ కావాలనే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. తన అల్లుడు మరణం కారణంగా కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న రాజాసింగ్ మళ్లీ ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
గోషామహాల్ నియోజకవర్గంలోని డివిజన్లకు సంబంధించిన టిక్కెట్ల విషయంలో బండి సంజయ్‌పై రాజాసింగ్ ఫైర్ అయిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తన అనుచరుల టిక్కెట్ల విషయంలో బండి సంజయ్ తనకు మోసం చేశారని వ్యాఖ్యలు చేసి రాజాసింగ్ గతంలో సంచలనం సృష్టించారు.
Must Read ;- ఎన్టీఆర్‌ని భుజాన ఎత్తుకున్న బీజేపీ చీఫ్ బండి సంజయ్!