మీ ఇల్లే థియేటర్ గా మారిపోనుందంటూ హీరో నాని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చేసిన ప్రకటన అందరికీ ఉత్సుకతను రేకెత్తించింది. ఆ సస్పెన్స్ కు రేపు ఉదయం తెరతీస్తానని కూడా ఆయన వీడియో విడుదల చేశారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారానే ఈరోజు విషయం చెప్పేశారు. సెప్టెంబరు 5న వి సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది.
అందులో కొత్త విషయం ఏమీ లేదు. ఆయన సినిమా ‘వి’ ఆమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కాబోతుందని ఇంతకుముందే వార్తలు వచ్చాయి. అదే విషయాన్ని ఆయన ఈరోజు ప్రకటించారు అంతే. తన 25 వ సినిమా అనుకోని కారణాల వల్ల విడుదల వాయిదా పడిందని, ఆ సంబరాన్ని సెప్టెంబరు 5న జరుపుకుందామని ఆయన పేర్కొన్నారు. తన తదుపరి చిత్రం టక్ జగదీష్ ని మాత్రం థియేటర్లలోనే చూసే ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా నాని హామీ ఇచ్చారు.
నాని ఏమన్నారు?
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. తనకు ఈ తరహా సినిమాలంటే ఇష్టమన్నారు. ‘నాటకీయత, వేగవంతమైన యాక్షన్ లతో సినిమా ఉంటుంది. సుధీర్ బాబు, నాకూ మధ్య పిల్లి, ఎలుక పోరాటాల మాదిరిగా సాగుతుంది. ఈ సినిమా విడుదలై నాకెంతో ఉద్వేగంగా ఉంది. 200 దేశాల్లో వి సినిమాను ఎక్కైనా ఎప్పుడైనా చూడొచ్చు. మరో విశేషం ఏమిటంటే నా మొదటి సినిమా విడుదలైన రోజే అంతర్జాతీయంగా వి సినమా విడుదలవుతోంది. అదే సెప్టెంబరు 5’ అన్నారు.
దిల్ రాజు ఏమన్నారంటే…
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఈ సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నానన్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తెరకెక్కిందని చెప్పారు.
వి కథేంటి:
ఓ క్రైమ్ రచయిత్రితో ప్రేమలో పడిన పోలీస్ కథ ఇది. సాల్వ్ చేయాల్సిందిగా ఓ పజిల్ ఇస్తూ హంతకుడు చేసే సవాళ్లతో ప్రశాంతంగా సాగే ఆ పోలీస్ జీవితం తల్లకిందులవుతుంది. నాని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరి ఇతర పాత్రలను పోషించారు. సంగీతం : అమిత్ త్రివేది, దర్శకత్వం: ఇంద్రగంటి మోహన్ కృష్ణ
V is coming home ❤️
September 5th.. The Hunt is On!@PrimeVideoIN #VOnPrime pic.twitter.com/28Lpb21RuE
— Nani (@NameisNani) August 20, 2020
Tomorrow 😊 pic.twitter.com/oQCouPM1SZ
— Nani (@NameisNani) August 19, 2020