తెలుగు నేల తొలవతరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బాలాజీ హాచరీస్ వ్యవస్థపకుడు సుందరనాయుడు తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కన్నుమూశారు. ఉమ్మడి ఏపీలో తొలి తరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన సుందరనాయుడు బాలాజీ హ్యాచరీస్ను స్థాపించి తెలుగు నేల గర్వించదగిన పారిశ్రామికవేత్తగా అంచెలంచెలుగా ఎదిగారు.
చిత్తూరు నగరానికి చెందిన సుందరనాయుడు పశు వైద్యుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బాలాజీ హ్చాచరీస్ పేరిట పౌల్ట్రీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు.ఏపీ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరించారు.అంతేకాకుండా కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేసిన నాయుడు, ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆయన ఆదర్శంగా నిలిచారు.
సుందర నాయుడు మృతి పట్ల పలువురు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు నెల గర్వించదగిన వ్యక్తి నాయుడు మృతి చెందడం ఎంతో బాధను కలిగిస్తోందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని అదేవిధంగా నాయుడు కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని కోరుతున్నట్లు తెలిపారు.